business

6వ త‌రం జెట్ ఇంజిన్‌ల‌ను త‌యారు చేయ‌నున్న భార‌త్‌.. మ‌న చుట్టూ ఉన్న దేశాల‌కు ఇక వ‌ణుకే..!

ప్రపంచం లో కేవలం 4 దేశాలు – అమెరికా, రష్యా, ఫ్రాన్స్, UK మాత్రమే నాణ్యమైన జెట్ ఇంజిన్స్ తయారు చేయగలవు. చైనా ఇంకా 4, 5వ తరం నాణ్యమైన ఇంజన్ తయారీ విషయంలో ఇబ్బంది పడుతుంది. భారత్ విషయంలో కావేరి ఇంజన్ ని అభివృద్ధి చేసినా అది అవసరమైన 90- 95kN శక్తి లేదా Thrust బదులు 73 – 75kN మాత్రమే produce చేస్తుంది. ఆ ఇంజన్ ని డ్రోన్స్ కోసం వినియోగించవచ్చు, యుద్ద విమానానికి పనికిరాదు. Tejas లో ప్రస్తుతానికి 84kN thrust ఉన్న అమెరికన్ F404 ఇంజన్ వాడుతున్నారు. మరింత శక్తివంతమైన GE F414 98kN ఇంజన్లు త్వరలో Tejas MK2, AMCA MK1 లలో వాడతారు.

6వ తరం యుద్ద విమానాల ప్రోగ్రామ్ లో చేరడానికి బదులు, 6వ తరం ఇంజన్ మీద పెట్టుబడి పెట్టడం , అది కూడా పూర్తి టెక్నాలజీ, Intelectual ప్రాపర్టీ రైట్స్ భారత్ కి ఇచ్చేలా క్రింది వారితో చర్చలు జరుపుతుంది. వారి ప్రతిపాదనలు వాటి లాభనష్టాలు. అమెరికన్ General Electric సంస్థ – Tejas mk1, mk2 , AMCA MK1 లో ఈ సంస్థ ఇంజిన్స్ ఉపయోగిస్తారు కావున, కొత్త ఇంజన్ వారి నుంచీ తీసుకుంటే maintenance తేలిక. ఇబ్బంది.. మన డబ్బులతో అభివృద్ధి చేసిన ఇంజన్ అయినా intellectual property rights, critical technology transfer కి సుముఖం గా లేదు కాబట్టి ఇది మంచి ఆఫర్ కాదు.రఫెల్ యుద్ధ విమానం లో ఉన్న ఇంజిన్స్ తయారు చేసే ఫ్రెంచ్ సంస్థ Safran వ‌ల్ల లాభాలు పైన చెప్పినవన్నీ. ఇబ్బంది.. 80% technology ఇస్తారు ( 20% వారు మనకి ఇవ్వడానికి సిద్ధంగా లేని సాంకేతికతే మనకి కీలకం). IPR మాత్రం 50% వారితో ఉంచాలి అంటున్నారు. అంటే, మనం దానికి మార్పులు చెయ్యాలి అన్నా, అమ్మకాలు, కొనుగోలు, ఎగుమతులు చెయ్యాలి అన్నా వారితో ముడిపడి ఉంటుంది.

india to make 6th generation of jet engines

రోల్స్ రాయిస్ – UK కి చెందిన ఈ సంస్థ 100% IPR ఇస్తాము, 100% సాంకేతికత ఇస్తాము, భారత్ లో local production set చేస్తాం అంటున్నారు. ఈ సంస్థ, జపాన్, UK మొదలైన దేశాలు తయారు చేస్తున్న 6వ తరం యుద్ద విమానానికి ఇంజన్ తయారు చేస్తుంది. భారత్ కి తయారు చేయబోయే ఇంజన్ ప్రస్తుతం ఉన్న ఇంజిన్స్ ని modify చేసి ఇస్తే కాదని పూర్తిగా కొత్తది అభివృద్ధి చేస్తాము అని చెబుతున్నారు. ఇది ఉన్న వాటిలో చాలా మంచి ఆఫర్. మనకోసం కొత్త ఇంజన్ తయారు చేయడం మంచిది అని మన అవసరాలకు తగ్గట్టు ఉంటుంది అని ఒక వర్గం. కాదు, 6వ తరం యుద్ద విమానం ఏదైతే వారు అభివృద్ధి చేస్తున్నారో దాని IPR, దాని టెక్నాలజీ 100% తీసుకుంటే మంచిది అని మనకి quality తగ్గించే అవకాశం ఉండదు అని మరో వాదన. చూడాలి, ఎటువెళ్తుందో మన నిర్ణయం.

Admin

Recent Posts