ఆధ్యాత్మికం

ఈ ఆల‌యంలో శివ‌లింగం రోజులో మూడు సార్లు రంగులు మారుతుంది తెలుసా..?

ధర్మభూమిగా పేరుగాంచిన భారత దేశంలో పురాణ ప్రాధాన్యత కలిగిన దేవాలయాలతో పాటు కొన్ని విచిత్రమైన దేవాలయాలు కూడా ఉన్నాయి. అందులో అటు పురాణ ప్రాధాన్యత ఉన్న దేవాలయాలతో పాటు దాదాపు ఐదేళ్ల క్రితం నిర్మించిన దేవాలయాలు ఉన్నాయి. అయితే హిందూ పురాణాల్లో మహాశివునికి అత్యంత ప్రాధాన్యతవుంది. అయితే దేశంలో ఉన్న పురాతన శివాలయాల్లో రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో ఉన్నఅచలేశ్వర మహాదేవ మందిరం ఒకటి.

ఇక్కడి గర్భగుడిలోని శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ శివలింగం రోజులో మూడుసార్లు రంగులు మారుతూ… అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఉదయం ఎరుపు వర్ణంలో, మధ్యాహ్నం కాషాయ రంగులో మ‌రియు సాయంత్రం కాగానే ఈ శివలింగం నలుపు రంగులోకి మారిపోతుంది. అలాగే ఈ శివలింగం పక్కకు కదులుతుంటుంద‌ట‌. ఈ విచిత్ర శివలింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్య‌లో వ‌స్తుంటారు.

achaleshwar mahadev temple this shiv ling changes to different colors

అయితే ఈ శివలింగం ఇలా రంగులు మారుతూ, కదలడానికి గాల కారణాలను తెలుసుకునేందుకు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేశారు. అయినా కానీ ఈ మిస్ట‌రీని చేధించ‌లేక‌పోయారు. అయితే కొంతమంది పరిశోధకులు సూర్యకిరణాలు శివలింగం పైన పడటం వల్ల శివలింగం ఇలా రంగులు మారుతుంది అంటారు. కానీ ఎవరూ కూడా సరైన శాస్త్రీయ వివరణ ఇవ్వలేకపోతున్నారు. ఈ 2500 ఏళ్ల ఆలయంలో మరో ప్రధాన ఆకర్షణగా నంది విగ్రహం చూడవచ్చు.

ఈ ఇత్త‌డి నంది ఐదు రకాలైన లోహములతో తయారు చేయబడినది. ఆలయ దాడికి ప్రయత్నించిన ముస్లిం మత ఆక్రమణదారులకు వ్యతిరేకంగా ఈ నంది విగ్రహం వారిపై దాడికి వేల తేనెటీగలను విడుదల చేసిందని ఇక్కడ స్థలపురాణం చెబుతుంది. చాలామంది రాజస్థాన్ ధోల్ పూర్ లో అచలేశ్వర్ మహదేవ్ టెంపుల్ నందు గల ఆసక్తికరమైన దృశ్యం చూచుటకు ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే వేచియుండి ఆ దృశ్యం తిలకిస్తారు.

Admin

Recent Posts