ఆధ్యాత్మికం

ఈ సూచ‌న‌లు పాటిస్తే కేవ‌లం 7 రోజుల్లోనే జాబ్‌లో ప్ర‌మోష‌న్ పొంద‌వ‌చ్చు తెలుసా..?

ప్ర‌భుత్వ‌, ప్రైవేటు కార్యాల‌యాలు వేటిల్లో ప‌నిచేసినా, ఏ సంస్థ‌లో ఉద్యోగం చేసినా ఉద్యోగులు దీర్ఘ‌కాలికంగా ప‌నిచేస్తుంటే ప్ర‌మోషన్‌, జీతాల పెంపు కోసం చూస్తారు. అయితే ఈ క్ర‌మంలో కొంద‌రు సక్సెస్ అవుతారు. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. ప‌నిలో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న లేదంటే ఉన్న‌తాధికారుల వ‌ద్ద పైర‌వీలు… ఇలా అనేక అంశాలు ఏ ఉద్యోగి ప్ర‌మోష‌న్‌, జీతం పెంపుతో అయినా ముడిప‌డి ఉంటాయి. అయితే ఒక వేళ ఇవి లేకున్న‌ప్ప‌టికీ ఎవ‌రికైనా ప్ర‌మోష‌న్ రావ‌డం లేదంటే అది క‌చ్చితంగా దుర‌దృష్టంగానే భావించాలి. అలాంటి వారు కింద చెప్పిన విధంగా చేస్తే ప‌నిలో ప్ర‌మోష‌న్ పొందే అవ‌కాశం ఉంటుంది. అది కూడా చాలా త్వ‌ర‌గానే. దీంతోపాటు జీతం పెరుగుతుంది కూడా. అయితే అలాంటి వారు ఏం చేయాలంటే… ఈ ప‌నిని ఆదివారంతో మొద‌లు పెట్టాలి. ఏ ఆదివారం అయినా ఫ‌ర్వాలేదు. ఆ రోజున ఉదయాన్నే లేచి త‌ల‌స్నానం చేసి ఒక రాగి చెంబు లేదా గ్లాస్‌, పాత్ర దేంట్లో అయినా నీటిని నింపాలి.

అనంత‌రం అందులో ఎండు మిర‌ప‌కాయ విత్త‌నాల‌ను వేయాలి. ఆ త‌రువాత ఆ నీటిని సూర్యునికి స‌మ‌ర్పించాలి. సూర్యునికి ఎదురుగా నిల‌బ‌డి ఆ పాత్ర‌ను సూర్యుని వైపు చూపిస్తూ దాన్ని పైకి ఎత్తి నీరు కింద‌కు పోయాలి. అయితే ఇలా ఉద‌యం 8 గంట‌ల‌కు ముందే చేయాలి. దీన్ని వారం రోజుల పాటు క్ర‌మం త‌ప్ప‌కుండా చేస్తే ప్ర‌మోష‌న్ పొంద‌వ‌చ్చు. ఆదివారం రోజున ఉద‌యాన్నే లేచి త‌ల‌స్నానం చేసి ఒక పాత్ర‌లో నీటిని నింపి అందులో కొంత బెల్లం వేసి, ఆ నీటిలో ప‌సుపు రంగు పూలు వేయాలి. ఆ త‌రువాత నీటిని పైన చెప్పిన విధంగానే పోయాలి. ఇలా ఉద‌యాన్నే 8 గంట‌ల లోపు చేయాలి. దీన్ని 11 రోజుల పాటు పాటించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ప్ర‌మోష‌న్ వెంట‌నే ల‌భిస్తుంది. అంగ‌వైక‌ల్యం ఉన్న వ్య‌క్తుల‌కు ఆర్థిక స‌హాయం లేదా అన్న‌దానం చేసినా దోషం పోతుంది. దీంతో జాబ్ ప్ర‌మోష‌న్ ల‌భించేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే ఇలా క‌నీసం 2 నెల‌ల‌కు ఓసారి అయినా చేయాల‌ట‌.

do like this to get job promotion in 7 days

ప్రతి రోజూ ఉద‌యాన్నే సూర్యుడు ఉద‌యించే స‌మ‌యంలో ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని సూర్యునికి ఎదురుగా నిల‌బ‌డి స‌మ‌ర్పిస్తే దాంతో ఆయ‌న అనుగ్ర‌హం ల‌భిస్తుంద‌ట‌. దీని వల్ల ఉద్యోగంలో ప్ర‌మోష‌న్ ల‌భించ‌డ‌మే కాదు, జీతం కూడా బాగా పెరుగుతుంది. పైన చెప్పిన‌వాటి గురించి హిందూ పురాణాల్లో ఉన్నాయి. వాటిని అంత తేలిగ్గా తీసుకోకండి. పాటించి చూస్తే తేడా మీకే తెలుస్తుంది.

Admin

Recent Posts