ఆధ్యాత్మికం

ఆల‌యంలో ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్న‌ప్పుడు ఈ పొర‌పాట్ల‌ను అస‌లు చేయ‌కండి..!

చాలా మంది ఆలయాలకి వెళ్తూ ఉంటారు. కొంచెం సేపు మనం గుడికి వెళ్లి మన బాధలను దేవుడికి చెప్పుకుంటే, ఏదో తెలియని సంతోషం కలుగుతుంది. బాధ అంతా తొలగిపోతుంది. ప్రశాంతంగా ఉండొచ్చు. చాలా మంది వీలైనప్పుడల్లా ఆలయానికి వెళ్తుంటారు ఆలయంలో ఏదైనా ఉత్సవం లేదంటే పండగలు వంటివి జరిగినప్పుడు ఎక్కువ మంది భక్తులు వెళుతూ ఉంటారు. ఆలయానికి వెళ్ళినప్పుడు కొన్ని తప్పుల‌ని చేయకూడదు అటువంటి తప్పులు చేయడం వలన పాపం తగులుతుంది. పుణ్యం లభించదు.

ఆలయానికి వెళ్ళినప్పుడు మనం దేవుడిని దర్శించుకోవడానికి ముందు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాము. ప్రదక్షిణలని చేసేటప్పుడు చాలామంది ఆలయాన్ని తాకుతూ ప్రదక్షిణలు చేస్తారు అలా అస్సలు చేయకూడదు. ఆలయానికి దూరంగా ఉండి ప్రదక్షిణలు చేయాలి తగులుతూ రాసుకుంటూ ఆలయంలో ప్రదక్షిణలు చేయకూడదు. అలానే వెనక భాగానికి వెళ్ళిన తర్వాత చాలామంది అక్కడ దండం పెట్టుకుంటుంటారు అలా చేయడం పొరపాటు అక్కడ రాక్షసులు ఉంటార‌ట కాబట్టి అసలు అక్కడ ముట్టుకోకూడదు. వాళ్ళని నిద్ర లేపినట్టు అవుతుందట.

do not make these mistakes while doing pradakshina in temples

దేవుడిని దర్శనం చేసుకుని మళ్లీ వెనక్కి వచ్చేటప్పుడు మన వెన్నుభాగాన్ని దేవుడికి చూపించకూడదు తిరిగి మళ్ళీ ముందు వెళ్లినట్లే ముందు భాగాన్ని దేవుడు వైపు ఉంచి వెనక్కి నడుచుకుంటూ వచ్చేయాలి. అదేవిధంగా ఆలయానికి వెళ్లి దర్శనం అయిపోయిన తర్వాత వెంటనే లేచి వచ్చేయకూడదు. కాసేపు కూర్చుని అప్పుడు లేచి రావాలి ఇలా ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోండి ఆలయానికి వెళ్ళినప్పుడు ఇలాంటి తప్పులు చేస్తే ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి. పుణ్యం కలగదు.

Admin

Recent Posts