lifestyle

పొరపాటున కూడా బంధువులకి చెప్పకూడని 5 సీక్రెట్స్ !

ఆచార్య చాణ‌క్యుడు తన వ్యూహాలు, నైపుణ్యాలతో ఒక సామ్రాజ్యాన్ని విజయవంతంగా నడిపించడంలో సక్సెస్ అయ్యారు. చాణక్యుడు తన నీతి గ్రంధం ద్వారా ఒక మనిషి సరైన మార్గంలో నడవాలంటే ఏ విధమైనటువంటి నడవడిక అలవర్చుకోవాలి?, ఎటువంటి లక్షణాలతో మెలగాలి?, తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్న మన జీవితాన్ని సరైన మార్గంలోకి వెళ్లాలంటే ఏం చేయాలి? అనే విషయాలను ఎంతో అద్భుతంగా వివరించారు. అయితే ఆచార్య చాణక్య కేవలం రాజకీయాలే కాకుండా ఆర్థికపరమైన శాస్త్రంలో, తత్వశాస్త్రం ద్వారా ఎన్నో విలువైన విషయాలను వివరించారు.

తన నీతి శాస్త్రంలో పేర్కొన్న అద్భుతమైన విషయాలు నేటి తరానికి కూడా ఎంతో ప్రేరణగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ టైపద్యంలోనే జీవితానికి సంబంధించిన ఎన్నో సంతోషకరమైన జీవిత రహస్యాలను పుస్తకంలో స్పష్టంగా పేర్కొన్నారు. చాణక్యుడు తన నీతి గ్రంధం ద్వారా పొరపాటున కూడా బంధువులకి చెప్పకూడని ఐదు ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. మనం బంధువుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు గాని, వారు మన ఇంటికి వచ్చినప్పుడు గానీ లేదా ఇతరులతో కానీ ఈ ఐదు రహస్యాలను ఇతరులతో పంచుకోకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

acharya chanakya told that we should never share these secrets

ఆచార్య చాణక్యుడు తన నీతి గ్రంధంలో నరదృష్టి ఎప్పటికీ మంచిది కాదని చెప్పారు. మనిషి యొక్క సహజ లక్షణం ఈర్ష. ఎదుటి వ్యక్తి బాగుపడితే మనిషి ఓర్వలేడు. మన దగ్గర ఎంత ధనం ఉన్నప్పటికీ అది ఎవరితోనో చెప్పుకోకూడదు. అలా చెప్పుకున్నట్లయితే ఆ ధనం అనేది మన దగ్గర నిలవదు. తాహతుకు మించి అప్పు చేయకూడదు. అలా చేసినట్లయితే ధనం ఎప్పటికీ వారి దగ్గర నిలవదు. అలాగే ఒకరికి అప్పుగా ఇచ్చి ఎవరైతే అధిక వడ్డీ వసూలు చేస్తారో వారి దగ్గర కూడా ధనం నిలవదు. ఎవరైతే తనని తాను ప్రేమించుకోవరో, తన ఫ్యామిలీనీ ప్రేమించరో వారి దగ్గర కూడా ధనం నిలవదు. ఎందుకంటే ప్రేమ, అనుబంధం అనేది ఆ కుటుంబంలో ఉండదో అప్పుడు ఆ కుటుంబంలో ధనం అనేది నిశిస్తూనే ఉంటుంది.

ఇతరులతో మనల్ని ఎప్పుడూ పోల్చుకోకూడదు. అలా ఎప్పుడైతే పోల్చుకోవడం మొదలు పెట్టామో అది మన మానసిక స్థితిని దిగజారింపజేస్తోంది. మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకోవడం. వ్యసనాలకు బానిసై ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు మన దగ్గర ధనం అనేది నిలవదు.

Admin

Recent Posts