ఆధ్యాత్మికం

త‌ల లేదా దిండు ద‌గ్గ‌ర వీటిని పెట్టి నిద్రించ‌కూడ‌దు.. ఎందుకంటే..?

మంచి నిద్ర మంచి ఆరోగ్యం అన్న విషయం తెలిసిందే.. అందుకే మనం పడుకొనే ముందు అన్ని సరిచేసుకొని దిండును మెడకు అనుకూలంగా పెట్టుకొని పడుకోవడం ఉత్తమం..మనం నిద్రించడానికి ఉపయోగించే దిండు మరీ మెత్తగా లేదా మరీ గట్టిగా ఉండకూడదు..అలాగే నిద్రపోయే ముందు కొన్ని వస్తువులను తలకింద పెట్టుకుని పడుకోకూడదని అంటారు. మనం కొన్ని వస్తువులను తలకింద పెట్టుకుని నిద్రిస్తున్నప్పుడు, అది మన జీవితంలో ప్రతికూల ప్రభావాలను చూపడం ప్రారంభిస్తుంది… అందుకే తలకింద ఎటువంటి వస్తువులు పెట్టుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

దిండుపై బంగారు లేదా వెండి ఆభరణాలను ఉంచడం వల్ల ఆ వ్యక్తి అదృష్టాన్ని బలహీనపరుస్తుంది. బంగారు, వెండి ఆభరణాలే కాదు, ఇనుప వస్తువులు కూడా ఉంచకూడదని చెబుతారు. మీకు దిండు కింద బంగారు ఆభరణాలు పెట్టుకుని నిద్రించే అలవాటు ఉంటే ఈరోజే అలాంటి అలవాట్లను వదిలేయండి.. మంచం దగ్గర లేదా తల దగ్గర బూట్లు, చెప్పులతో పడుకోవడం వల్ల జీవితంలో ప్రతికూలత వ్యాపిస్తుంది.. పొరపాటున కూడా వీటిని పెట్టుకోకండి.. వాచ్, మొబైల్, ఫోన్, ల్యాప్టాప్, టీవీ, వీడియో గేమ్ వంటి వాటిని తల కింద పెట్టుకుని నిద్రపోకండి. వాటి నుంచి వెలువడే కిరణాలు ఆరోగ్యానికి హానికరం..

do not put these items near your pillow while sleeping

.పర్సులు, హ్యాండ్ బ్యాగ్లు ఉంచవద్దు. ఎందుకంటే ఇది మీ అనవసర ఖర్చులను పెంచుతుంది. మీ దగ్గర డబ్బు నిలవదు.. మ్యాగజైన్లు వంటి వాటిని మన తల కింద ఉంచడం ఒక వ్యక్తి జీవితాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.. మంచి పుస్తకాలు తల దగ్గర పెట్టుకోడం మంచిది..

Admin

Recent Posts