ఆధ్యాత్మికం

సంధ్య దీపాన్ని ఇలా వెలిగించండి.. మీకు ఉండే స‌మ‌స్య‌లు అన్నీ తొల‌గిపోతాయి..!

వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎలాంటి సమస్యకైనా కూడా మంచి పరిష్కారం ఉంటుంది. ఈ విధంగా ఆచరిస్తే సమస్యలకి దూరంగా ఉండొచ్చు. పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. సాయంత్రం పూట దీపాన్ని వెలిగిస్తే చాలా మేలు కలుగుతుంది ముఖ్యంగా చాలా మంది తప్పకుండా సంధ్య‌ వేళ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు ఆనందం కలుగుతుంది. లక్ష్మీదేవి ఇంట కొలువై ఉంటుంది సంధ్య‌ వేళలో దీపాన్ని పెట్టేటప్పుడు ఎటువంటి వాస్తు నియమాలని పాటించాలి ఎలా చేస్తే మేలు కలుగుతుంది అనే ముఖ్య విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం రోజు తూర్పు వైపు దీపాన్ని వెలిగించడం వలన ఎక్కువ కాలం బతకచ్చు ఆయువు పెరుగుతుంది. అదే మీరు ఇబ్బందులు బాధల నుండి బయటపడాలంటే పడమర దిక్కున దీపం పెట్టండి అప్పుడు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆనందంగా జీవించొచ్చు. ఉత్తరం వైపు ని కనుక దీపాన్ని వెలిగిస్తే ధనం పెరుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది.

lit sandhya deepam like this daily to get rid of problems

దక్షిణ దిశ లో సంధ్య‌ దీపాన్ని పెట్టడం వలన ఏదైనా నష్టం కలిగితే దాని నుండి బయటపడడానికి అవుతుంది. పిండితో చేసిన దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు అలానే దీపాన్ని వెలిగించేటప్పుడు నువ్వుల నూనె ఉపయోగిస్తే మరీ మంచిది చూశారు కదా పండితులు చెప్పిన వాస్తు చిట్కాలను మరి వీటిని ఫాలో అయితే ఏ సమస్య కూడా ఉండదు ఆనందంగా ఉండొచ్చు.

Admin

Recent Posts