వినోదం

చేతిలో చిల్లి గవ్వలేని సమయంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ పెళ్లి చేసిన యాంకర్, నటి ఎవరో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ స్టార్ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ ఒకరనే సంగతి తెలిసిందే. అతి తక్కువ సమయంలో సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ విజయాలు సాధించడంలో పూరి స్టైలే వేరు. ఇండస్ట్రీలో చాలామంది హీరోలకి సూపర్ హిట్స్ ని తీసుకొచ్చారు పూరి. ఈ దర్శకుడి డైరెక్షన్ లో ఏ హీరోకైనా ఇమేజ్ వస్తుంది. తర్వాత నిజంగా పెద్ద స్టార్లు కూడా అయిపోతుంటారు. అయితే ఇటీవల పూరి జగన్నాథ్ తన పర్సనల్ విషయాల గురించి మరియు పెళ్లి గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పూరి జగన్నాథ్ తన భార్య లావణ్య ని వివాహం చేసుకునే సమయంలో అతని దగ్గర కొంచెం కూడా డబ్బులు లేవు అని అన్నారు.

పూరి చేతిలో చిల్లిగవ్వలేని సమయంలో లావణ్య ఆయన వెంట వచ్చింది. వీళ్లది ప్రేమ వివాహం కావడంతో ఎవరికీ చెప్పకుండా రహస్యంగా గుళ్లో పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు మూడు ముళ్ళు వేయడానికి తాళిబొట్టు కావాలి కదా.. ఆ సమయంలో తాళిబొట్టు కొనడానికి కూడా డబ్బులు లేని పరిస్థితులలో పూరి జగన్నాథ్ ఉన్నాడట. ఆ సమయంలో యాంకర్ ఝాన్సీ తాళిబొట్టు కొనిచ్చారట. పెళ్లి బట్టలు అయితే హేమ కొనిపెట్టారని, అదేవిధంగా కొంతమంది ఫ్రెండ్స్ కూల్ డ్రింక్స్ వంటివి కొని సహాయం చేశారట. ఆ తర్వాత ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చి స్టార్ డైరెక్టర్గా ఎదిగారు పూరి జగన్నాథ్.

puri jagannadh had no money when he is married

అయితే ఎంతో సంపాదించినా సరే కొంతమంది స్నేహితులను గుడ్డిగా నమ్మడం వల్ల మోసపోవాల్సి వచ్చింది. దీంతో చాలా సంపాదన పోగొట్టుకున్నారు. అయితే ఆయన పెళ్లికి సహాయం చేసిన ఝాన్సీ, హేమ మరియు మిగిలిన స్నేహితులని ఎప్పటికీ మర్చిపోలేను అని పూరి జగన్నాథ్ చాలా సందర్భాల్లో చెప్పారు. ఇక పూరి జగన్నాథ్ ప్రస్తుతం లైగర్ సినిమా ఫ్లాప్ కావడంతో మరోసారి చాలా నష్టపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ రెండు సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఒకటి బాలీవుడ్ లో కాగా మరొకటి టాలీవుడ్ లో. అయితే మొదట ఏది కార్యరూపం దాల్చబోతుంది అనేది క్లారిటీ లేదు.

Admin

Recent Posts