ఆధ్యాత్మికం

పూరీ జ‌గ‌న్నాథుని ర‌థ యాత్ర వెనుక ఉన్న అస‌లు విష‌యం ఇదే..!

ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్ల పక్షం రెండో రోజున జగన్నాథ రథయాత్రను పూరీ లో జరుపుతారు. దేశ, విదేశాల నుండి లక్షల్లో భక్తులు ఈ రథ యాత్రలో పాల్గొంటారు. పూరి నగరం లోని జగన్నాథుని తీర్థ యాత్ర ఎంతో పవిత్రమైనది. అంగరంగ వైభవంగా జరుపుతారు. ఈ పవిత్ర యాత్ర లో బలరాముడు, తన సోదరి సుభద్ర కూడా ఉంటారు. ఈ యాత్ర కి వెళ్తే అన్ని తీర్థయాత్రల ఫలాలు లభిస్తాయని అంతా నమ్ముతారు. అయితే దీని గురించి చాలా మందికి తెలియని రహస్యాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

జగన్నాథుని రథయాత్రని ఎంతో వైభవంగా మేళ తాళాలతో మొదలు పెట్టి పూరీ చుట్టు పక్కల ప్రాంతమంతా పండుగ వాతావరణం ఉంటుంది. ఒక సమాధి వద్ద ఇది ఆగుతుంది. ఇక్కడ మూడు రథాలు కాసేపు ఆగి సమాధికి దగ్గర లో ఉన్న ఆత్మలు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటాయి. అలానే జగన్నాథుడికి సల్బేగ్ అనే ఒక ముస్లిం భక్తుడు వున్నాడు. సల్బేగ్ తల్లి హిందువు, తన తండ్రి ముస్లిం. జగన్నాథ రథయాత్ర లో పాల్గొనడానికి లేదా ప్రవేశించడానికి అనుమతి లేదు. సల్బేగ్ చూపిన భక్తికి జగన్నాథుడు సంతోషించాడు. జగన్నాథ రథయాత్ర వస్తున్నప్పుడు సాల్బేగ్ మార్గం మధ్యం లో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.

puri jagannadh temple rath yatra interesting facts to know

రథయాత్రలో పాల్గొనే అవకాశం కోసం అడిగాడు. తర్వాత ఒక సారి సాల్బేగ్ కుటీరం దగ్గర రథం ఆగిందని అక్కడి నుంచి ముందుకు కదిలిచేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. సాల్బేగ్ జగన్నాథుడిని పూజించిన తర్వాత రథచక్రం వెళ్ళింది. రథయాత్ర కోసం అక్షయ తృతీయ రోజు నుంచే రథం తయారు చేసే పనులు మొదలు అవుతాయి. ఈ రధం ని వేప కలప తో తయారు చేస్తారు. మూడు రథాల తయారీకి 884 చెట్లను వాడతారు. అడవికి వెళ్లి రథాన్ని నడిపేందుకు ఉపయోగించే చెట్లకు పూజారులు వెళ్లి పూజలు చేస్తారు. పూజ అయ్యాక బంగారు గొడ్డలితో చెట్లను నరుకుతారు.

Admin

Recent Posts