పోష‌ణ‌

మీ షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను త‌గ్గించుకోవాలంటే.. రోజూ వీటిని తినండి..!

ఈరోజుల్లో చాలా మంది రకరకాల సమస్యలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా బీపీ షుగర్ తో పాటుగా కొలెస్ట్రాల్ సమస్య అందర్నీ బాధిస్తుంది. గుండె పోటు, షుగర్, పక్షవాతం, కిడ్నీ సమస్యలు మొదలైన సమస్యలు అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం అనారోగ్యకరమైన అలవాట్ల వలన వస్తున్నాయి. షుగర్ లెవెల్స్ కూడా ఎక్కువగా పెరిగిపోతున్నాయని చాలామంది ఇబ్బంది పడుతున్నారు. షుగర్ పేషెంట్లు అలానే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించుకోవాలనుకునే వాళ్ళు వీటిని కచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. వీటిని తీసుకుంటే ఈ రెండు సమస్యలు కూడా ఉండవు.

షుగర్ తగ్గాలన్నా కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గాలన్నా గోధుమలు, మొక్క జొన్న, మిల్లెట్స్ వంటివి తీసుకోండి. తేనె, బెల్లం, చక్కెర, పాలిష్ ఆహార పదార్థాలు, బేకరీ పదార్థాలు వంటివి తీసుకోకండి. కొలెస్ట్రాల్ సమస్య తగ్గాలన్నా షుగర్ సమస్య లేకుండా ఉండాలన్నా చేపలు, చికెన్ గుడ్డులోని తెల్ల సొన, చిరుధాన్యాలు, ఫ్యాట్ మిల్క్ వంటి వాటిని తీసుకోండి. వీటిలో ప్రోటీన్ శాతం అధికంగా ఉంటుంది. పిండి పదార్థాలు లేని పండ్లు, కూరగాయలను కూడా మీరు తీసుకోండి. చాలా మంది అనారోగ్యకరమైన చిరుతిళ్లని తీసుకుంటూ ఉంటారు.

eat these foods if you have diabetes and high cholesterol

అలా కాకుండా మీరు మంచి స్నాక్స్ ని తీసుకోండి. జంక్ ఫుడ్ కాకుండా ఆకలి తో ఉన్నప్పుడు హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే వాటిని తీసుకోండి. వాల్ నట్స్, బాదం, మొలకలు వంటివి తీసుకోండి. వీటన్నిటితో పాటుగా నీళ్లు ఎక్కువగా తీసుకోవడం చాలా ముఖ్యం. తగినంత నీళ్లు తాగుతూ ఉండాలి. ఇది హైడ్రేషన్ సమస్య లేకుండా చూసుకోండి. పండ్ల రసాలు, హెల్తీ డ్రింక్స్ ని కూడా తీసుకోవచ్చు. ఈ ఆహారాన్ని తీసుకుంటూ వ్యాయామం కోసం సమయాన్ని వెచ్చించండి. ఇలా ఈ విధంగా ఫాలో అయితే సమస్యలు లేకుండా ఉండొచ్చు ఆరోగ్యంగా జీవించొచ్చు.

Admin

Recent Posts