అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

వారంలో ఆ రోజునే గుండె పోటులు అధికంగా వ‌స్తున్నాయ‌ట‌..!

ఇటీవల చిన్నాపెద్దా తేడా లేకుండా చాలా మంది గుండెపోటు బారిన పడి అర్దాంతరంగా కన్నుమూస్తున్నారు. అయితే గుండెపోటుకు అనేక కారణాలున్నా.. జీవనశైలిలో మార్పులు, ఇతర ఆరోగ్య సమస్యలే ముఖ్య కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. ఇతర రోజులతో పోలిస్తే సోమవారం రోజే తీవ్రమైన గుండెపోటు (STEMI) కేసులు ఎక్కువగా సంభవించే అవకాశం ఉందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.

ఎస్‌టీ-సెగ్మెంట్‌ ఎలివేషన్‌ మయోకార్డియల్‌ ఇన్‌ఫార్‌క్షన్‌ (STEMI) అనేది ఓ రకమైన గుండెపోటు. సాధారణ భాషలో చెప్పాలంటే గుండె రక్తనాళం వంద శాతం పూడుకుపోవడం వల్ల తలెత్తే సమస్య ఇది. ఈ పరిస్థితి తలెత్తడం తీవ్ర అనారోగ్యంతోపాటు ఒక్కోసారి మరణానికీ దారితీస్తుంది. అయితే, దీనిపై ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్‌ హెల్త్‌ అండ్‌ సోషల్‌ కేర్‌ ట్రస్ట్‌, రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ సర్జన్స్‌ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. వీటికి సంబంధించిన అధ్యయన ఫలితాలను బ్రిటన్‌లోని మాంచెస్టర్‌లో జరిగిన బ్రిటిష్‌ కార్డియోవాస్క్యులర్‌ సొసైటీ (BCS) కాన్ఫరెన్స్‌లో పరిశోధకులు వెల్లడించారు.

heart attacks are occurring mostly on monday

వారంలో మొదటి రోజు (సోమవారం)-స్టెమీ సంభావ్యతకు మధ్య బలమైన సంబంధాన్ని కనుగొన్నాం. ఇది గతంలోనే వెల్లడైనప్పటికీ.. దీనిపై ఆసక్తి కొనసాగుతూనే ఉంది అని అధ్యయనానికి నేతృత్వం వహించిన బీహెచ్‌ఎస్‌సీ ట్రస్ట్‌ పరిశోధకుడు జాక్‌ లాఫన్‌ పేర్కొన్నారు.

Admin

Recent Posts