ఆధ్యాత్మికం

గురువారం రోజు ఈ వస్తువులు బీరువాలో పెడితే ధనలక్ష్మి మీవెంటే..!!

హిందూ సాంప్రదాయం ప్రకారం ఏడు రోజులలో ప్రతి రోజుకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. వాటి ప్రత్యేకతను బట్టి వివిధ పనులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా హిందూ మతం ప్రకారం సోమవారం శివుని వారముగా, మంగళవారాన్ని ఆంజనేయ స్వామి వారముగా, బుధవారాన్ని సుబ్రహ్మణ్య స్వామివారంగా, గురువారాన్ని మహావిష్ణువు వరంగా, శుక్రవారం లక్ష్మీదేవి, శనివారం వెంకటేశ్వర స్వామి వారాలుగా తీసుకుంటారు. ఈ ప్రత్యేక వారాలలోనే ఆ దేవుళ్లను పూజిస్తారు.

ఇందులో ముఖ్యంగా గురువారం రోజు శ్రీమహావిష్ణువుకు, లక్ష్మీదేవికి పూజించడం వల్ల బృహ‌స్పతి వారి జీవితంలో బలంగా ఉంటాడ‌ని ప్రజలు నమ్ముతారు. ఎవరి జాతకంలో అయితే బృహస్పతి బలంగా ఉంటాడో వారు అష్టైశ్వర్యాలతో పాటు ఆరోగ్యంగా సుఖసంతోషాలతో ఉంటారని నమ్ముతారు. గురువారం రోజున కొన్ని వస్తువులను బీరువాలో పెట్టడం వల్ల ధనలక్ష్మి వరం లభిస్తుందని పండితులు అంటున్నారు.

put these items in beeruva on thurs day for wealth

ముఖ్యంగా గురువారం రోజున మహా విష్ణువుకు పూజ చేస్తారు. దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయని పండితులంటున్నారు.. ఒక కొబ్బరికాయను తీసుకొని గురువారం రోజు వెంక‌టేశ్వ‌రాలయానికి వెళ్లి కొబ్బరికాయని విగ్ర‌హానికి తాకించి మనసులో ఉన్న కోరికలను కోరుకొని తర్వాత కొబ్బరికాయని ఇంటికి తీసుకెళ్లి భద్రంగా పెట్టాలని పండితులు అంటున్నారు.

Admin

Recent Posts