అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఫోన్ అతిగా వాడుతున్నారా.. చాలా పెద్ద ప్రమాదం..!!

ప్రస్తుత కాలంలో ఒక పూట తిండి లేకుండా ఉంటున్నారు కానీ ఫోన్ లేకుండా అసలు ఉండడం లేదు. ఇల్లు లేని వారి ఇంట్లో కూడా మొబైల్ ఫోన్ తప్పనిసరిగా ఉంటోంది. అలాంటి మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడితే అనేక అనర్ధాలు ఉన్నాయి.. అది మతిమరుపుకు కూడా కారణమవుతుంది.. అతిగా ఫోన్ వాడేవారు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి.. ప్రతి ఏడాది మొబైల్ వాడకం అనేది పెరుగుతూ వస్తోంది. కొంతమంది మొబైల్ ఫోను పదేపదే చెక్ చేస్తూ నోటిఫికేషన్లు చూడడం వంటి వాటి మీద ఉంటారు. ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం ఏంటంటే మొబైల్ ఫోన్ వాడటం వల్ల జ్ఞాపకశక్తి దెబ్బతింటుంది.

అత్యంత ప్రమాదకరమైన ఉదాహరణలలో డ్రైవింగ్ చేస్తూ ఫోన్ వాడడం అనేది ఒకటి. మొబైల్ పక్కనపెట్టి ఏదైనా పనిమీద దృష్టి పెట్టిన సమయంలో మొబైల్‌లో డింగ్ అనే నోటిఫికేషన్ శబ్దం వినగానే వారు చేసే పనిపై కాస్త నిబద్ధత తగ్గుతుందని ఒక అధ్యయనంలో తేరింది. ఇటీవల ఒక పరిశోధన ద్వారా మరో ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. ఇటీవల కొంతమందితో ఒక టాస్క్ చేశారట.. కొంతమంది వ్యక్తులకు ఫోన్లు ఇచ్చి వాటిని ఎప్పుడు దగ్గరగా పెట్టుకోవాలని చెప్పారట.

if you are using phone excessively then know this

మరి కొంతమందికి ఫోన్ ఇచ్చి వాటిని దగ్గరగా పెట్టుకోకుండా వేరే గదిలో లేదంటే బ్యాగులో పెట్టుకోవాలని సూచించారట. ఇక వీళ్లకు మెమొరీ పవర్ పరీక్షించడం కోసం కొన్ని టాస్కులు ఇచ్చారట. ముఖ్యంగా మొబైల్ ఫోన్ దగ్గరగా పెట్టుకున్న వారి కంటే గదిలో మొబైల్ ఫోన్ పెట్టుకున్న వారు టాస్కులు మెరుగ్గా చేశారని పరిశోధకులు కనుగొన్నారు. ఫోన్ లో ఎక్కువసేపు గడిపితే బ్రెయిన్ డ్రెయిన్ కు కారణమవుతుంది. అతిగా మొబైల్ ఫోన్ వాడిన వారు మతిమరుపు బారిన పడుతున్నారని పరిశోధనలో తేలింది.

Admin

Recent Posts