హెల్త్ టిప్స్

వెన్ను నొప్పితో బాధపడుతున్నారా..అయితే ఈ ఫుడ్ తినాల్సిందే..

ప్రస్తుత కాలంలో చాలా మంది వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం గంటల తరబడి నిలుచుని లేదా కూర్చొని ఉండటం ఈ నొప్పికి కారణం కావచ్చు. అంతేకాకుండా పోషకాహారం తినకపోవడం, కనిపించినటువంటి జంక్ ఫుడ్ తినడం వల్ల సరైన పోషకాలు తినకపోవడం వల్ల వెన్ను నొప్పి, మెడ నొప్పులకు కారణం అవుతుంది. ఈ నొప్పితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. మరి దీని నుంచి బయట పడాలంటే మనం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.. సాధారణంగా చాలామంది ఈ వెన్నునొప్పితో బాధపడుతూ ఉంటారు.

ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు ముఖ్యంగా గుడ్లు తినాలంట. వీటిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల మనకు మేలు చేస్తాయని అంటున్నారు. విటమిన్ b6, బి12, విటమిన్ డి వంటి ముఖ్యమైన పోషకాలు లభిస్తాయని దీని ఫలితంగా ఎముకలు పటిష్టంగా ఉంటాయని అంటున్నారు. వెన్ను నొప్పితో బాధపడేవారు పసుపును పాలలో కలుపుకొని తాగితే శరీరంలో ఏవైనా ఇన్ఫెక్షన్ ఉంటే పోతాయట. వెన్ను నొప్పిని తగ్గించడంలో అల్లం ప్రభావంతంగా పనిచేస్తుంది.

follow these tips to get rid of back pain and eat these foods

ఒక టీ స్పూన్ తేనె, రెండు టీ స్పూన్ అల్లం రసం కలుపుకొని తాగితే ప్రయోజనం ఉంటుందట. అంతేకాకుండా డార్క్ చాక్లెట్ల‌లో ఐరన్, మెగ్నీషియం, జింకు వంటి లవణాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ అనే పిలవబడే యాంటీ ఆక్సిడెంట్లు వెన్ను నొప్పికి ఉపశమనాన్ని కలిగిస్తాయట. మరి ఎందుకు ఆలస్యం ఈ విటమిన్స్ ఉండే ఆహారాన్ని తినండి.

Admin

Recent Posts