ఆధ్యాత్మికం

ఆ ఆల‌యంలో రాత్రి పూట ఉంటే అంతే.. రాళ్లుగా మారిపోతారు..

భారత దేశం ఎన్నో వింతలకు నెలవు..ప్రముఖ ఆలయాలలో ఎన్నో అంతు చిక్కని రహస్యాలు కూడా ఉన్నాయి.వీటిలో కొన్నింటిని మానవ మేథస్సు, సైన్స్ కూడా అర్థం చేసుకోలేదు .అంబరాన్ని తాకుతున్న మనిషి కొన్ని దేవాలయాల్లోని రహస్యాలు నేటికీ వెల్లడి కాలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు మనం ఎన్నో రహస్యాలు, వింతలను దాచుకున్న ఆలయం గురించి తెలుసుకుందాం.. ఈ ఆలయం గురించి కథ చాలా షాకింగ్ గా ఉంటుంది. ఈ ఆలయంలో రాత్రిపూట ఎవరూ ఉండరని చెబుతారు. ఈ ఆలయంలో రాత్రిపూట ఎవరైతే బస చేస్తారో వారు శిలారూపంగా మారతారని ప్రజల నమ్మకం. అయితే.. ప్రజల నమ్మకం నిజామా కదా.. ఆలయం వెనుక ఉన్న నిజం ఏమిటి.. ఆలయం వెనుక ఉన్న మిస్టరీ నేటికీ ఛేదించబడలేదు. మరి మనిషిని రాయిగా మార్చే ఆలయం గురించి ఆసక్తికర విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…

రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో ఉన్న ఈ ఆలయాన్ని కిరాడు ఆలయంగా ప్రజలు పిలుస్తారు. ఈ ఆలయ నిర్మాణం దక్షిణ భారత శైలిని పోలి ఉంటుంది. అందమైన శిల్పాలు ఆకట్టుకునే నిర్మాణంతో ఉన్న ఈ ఆలయాన్ని రాజస్థాన్ ఖజురహో అని కూడా పిలుస్తారు. ఒక నివేదిక ప్రకారం, క్రీ.పూ.1161లో ఈ ప్రదేశం పేరు కిరాత్ కూప్. ఇది ఐదు దేవాలయాల సమూహం. ఇప్పుడు ఇక్కడ చాలా దేవాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. శివాలయం, విష్ణు దేవాలయం పరిస్థితి బాగానే ఉంది. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే దానిపై పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది.

rajasthan kiradu temple what is the mystery behind it

ఎనిమిది వందల క్రితం ఒక మహర్షి తన శిష్యులతో కలిసి దేశ సంచారంలో భాగంగా ఈ ఆలయానికి చేరుకున్నాడని చెబుతారు. ఒకరోజు ఆయన శిష్యులను గుడిలో విడిచిపెట్టి తీర్ధ సందర్శనార్ధం వెళ్ళాడు. ఈ క్రమంలో ఒక శిష్యుడి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. సన్యాసి ఇతర శిష్యులు గ్రామస్తుల నుండి సహాయం కోరారు.. అయితే ఎవరూ వారికి సహాయం చేయలేదు. కాగా, శిష్యులకు ఒక మహిళ సహాయం చేసిందని కూడా చెబుతారు.

ఈ విషయం తెలుసుకున్న సన్యాసికి కోపం వచ్చి, సాయంత్రం తర్వాత ప్రజలంతా రాళ్లుగా మారతారని గ్రామస్తులను శపించాడు. అంతేకాదు తన శిష్యులకు సహాయం చేసిన స్త్రీని సాయంత్రానికి ముందే ఊరు విడిచిపెట్టి వెళ్లిపొమ్మని.. వెనుతిరిగి చూడవద్దని చెప్పాడు. కానీ ఆమె ఆ ఆజ్ఞ పాటించ‌లేదు. దీంతో ఆమె కూడా చివరికి రాయి అయ్యిందట..చీకటి పడితే మాత్రం అక్కడ ఒక్క పురుగు కూడా ఉండరు.. ఇప్పటికీ ఈ వింత గురించి కథ కథలుగా చెప్పుకుంటారు..సైన్స్ కు ఇది పెద్ద సవాల్ గా మారింది..

Admin

Recent Posts