lifestyle

ఇక‌పై ప‌ని మీద బ‌య‌ట‌కు వెళ్తే ఇలా చేయండి.. మీరు అనుకున్న ప‌ని విజ‌య‌వంతంగా పూర్త‌వుతుంది.. ల‌

పాజిటివ్ ఎనర్జీని కలిగి నెగటివ్ ఎనర్జీ ని దూరం చెయ్యాలని అనుకుంటున్నారా..? వాస్తు ప్రకారం మనం నడుచుకుంటే ఎలాంటి సమస్యలు రావు. పైగా పాజిటివ్ ఎనర్జీని కలిగి నెగటివ్ ఎనర్జీ ని దూరం చేసేయచ్చు. వాస్తు ప్రకారం నడుచుకుంటే ఏ ఇబ్బంది ఉండదని చాలా మంది వాస్తు ప్రకారం ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉండడం… వాస్తుకు విరుద్ధంగా ఏమైనా ఉంటే వాటిని తొలగించేయడం ఇలా చేస్తూ వుంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి కొన్ని విషయాలను చెప్పారు. మరి వాటి కోసం ఈరోజు తెలుసుకుందాం.

చాలా మంది ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు పెరుగుని తింటూ ఉంటారు. అయితే పెరుగుని తినడం మంచిదా..? పెరుగు తింటే ఏమవుతుంది ఎందుకు తినాలి అనే సందేహాలు చాలా మందిలో ఉండే ఉంటాయి. దానికోసమే ఈరోజు తెలుసుకుందాం. పెళ్లి జరగాలన్నా ఉద్యోగం రావాలన్నా ఏదైనా సమస్య వున్నా… ఆ పని చేయడానికి ముందు పంచదార పెరుగులో వేసుకుని తింటూ ఉంటారు అయితే ఎందుకు అలా తినాలి..?

if you are going outside from home do like this to be successful in your work

పంచామృతాలలో పెరుగు కూడా ఒకటి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఖచ్చితంగా పెరుగుని తీసుకుంటే పాజిటివ్ రిజల్ట్ వస్తుందని.. ఏకాగ్రత పెరుగుతుందని దీనితో మనం అనుకున్న దానిని పూర్తి చేయచ్చు అని చెప్తున్నారు. పైగా పెరుగు తిని ఇంట్లో నుండి వెళ్లడం వలన నెగటివ్ ఎనర్జీ తొలగి పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలానే మెదడు అంతా కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది దీనితో పని పూర్తి చేసుకోవడం ఈజీ అవుతుంది. అనుకున్నది సాధించొచ్చు. అందుకనే చాలా మంది ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నప్పుడు కానీ ఏదైనా ముఖ్యమైన పని ఉన్నప్పుడు కానీ ఇలా చేస్తూ ఉంటారు పైగా ఆరోగ్యానికి కూడా పెరుగు మంచిదే.

Admin

Recent Posts