నేడు ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరిదీ ఉరుకుల పరుగుల బిజీ జీవితం అయిపోయింది. నిత్యం ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి మళ్లీ నిద్రించే వరకు చాలా మంది ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. రోజూ అనేక సందర్భాల్లో అనేక సంఘటనల్లో మానసిక సంఘర్షణలకు లోనవుతున్నారు. దీంతో డిప్రెషన్ బారిన పడి ప్రాణాలను బలవంతంగా తీసుకుంటున్నారు. అయితే కింద చెప్పిన విధంగా 4 మంత్రాలను నిత్యం చదువుతూ ధ్యానం చేస్తే దాంతో మీకు కలిగే ఒత్తిడి, డిప్రెషన్ బారి నుంచి ఇట్టే బయట పడవచ్చు. మరి ఆ మంత్రాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1వ మంత్రం… (సర్వ బాధ మంత్ర )
సర్వ బాధా ప్రశ్మనమ్ త్రైలోక్య స్యాఖిలేశ్వరి, ఏవమేవ్ త్వయ కార్యమస్మద్దైరి వినాశనమ్, సర్వ బాధా విర్మిర్ముక్తో ధన్‌ధాన్యస్తుతాన్విత్, మనుష్యో మత్ర్పసాదేన భవిష్యతి న సంశ్య.
2వ మంత్రం… (బాధానివారక్ మంత్ర)
సర్వ బాధా ప్రశ్మనమ్ త్రైలోకస్యార్విలేశ్వరి, ఏవమేవ్ త్వయా కార్యస్మద్వవైరివినాశనమ్, ఓం నమశ్చండికాయై.
3వ మంత్రం… (బాధానివారక్ మంత్ర)
ఓం హంసః హంసః
4వ మంత్రం… (బాధానివారక్ మంత్ర)
కాళి కాళి మహాకాళి, మనోస్తుత హన హన, దహ దహ శూలం త్రిశూలేన హోం ఫట్ స్వాహా.
పైన చెప్పిన నాలుగు మంత్రాలను రోజూ పఠిస్తూ ధ్యానం చేయాలి. ఈ మంత్రాలను బాధ నివారక మంత్రాలు అని పిలుస్తారు. వీటిని పఠించడం వల్ల అన్ని బాధలు, ఒత్తిళ్లు తొలగిపోవడంతోపాటు సంతోషంగా ఉంటారట. సంపద బాగా కలుగుతుందట. ఆయురారోగ్యాలతో జీవిస్తారట.