వైవిధ్యభరితమైన చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం హీరో మహేష్‌తో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అంతకు ముందు ఆయన తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఘన విజయం సాధించింది. ఇందులోని నాటు నాటు పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డు రావడం విశేషం. అయితే ఆయన తెరకెక్కించిన బాహుబలి మూవీ రెండు పార్ట్‌లుగా రాగా ఈ రెండు మూవీలకు కూడా ప్రేక్షకులు బ్రహ్మ రథం పట్టారు. కానీ ఈ రెండు మూవీల్లో నటించిన నటీనటులు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు.. అనే విషయం చాలా మందికి తెలియదు. ఈ క్రమంలోనే ఈ మూవీలకు గాను నటీనటులు, దర్శకుడు రాజమౌళి పొందిన రెమ్యునరేషన్ వివరాలను ఇప్పుడు చూద్దాం.
బాహుబలి రెండు పార్ట్‌లకు గాను ప్రభాస్‌కు ఒక్కో దానికి రూ.50 కోట్ల చొప్పున మొత్తం రూ.100 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. అలాగే రానాకు రూ.30 కోట్లు, శివగామిగా అలరించిన రమ్య కృష్ణకు రూ.6 కోట్లు, నాజర్ రూ.1 కోటి, సత్యరాజ్ రూ.2 కోట్లు, అనుష్క శెట్టి రూ.5 కోట్లు, తమన్నా రూ.4 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం.
ఇక దర్శకుడు రాజమౌళి ఈ మూవీకి గాను వచ్చిన ప్రీ రిలీజ్ బిజినెస్ లాభాల్లో 3వ వంతు వాటా తీసుకున్నట్లు తెలిసింది. అంటే రూ.150 కోట్ల వరకు ఆయన అందుకున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఆయన ఎప్పుడు చూసినా నిరాడంబరంగానే కనిపిస్తారు.