బేకింగ్ సోడా… దీని గురించి చాలా మందికి తెలుసు. వంటల్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రధానంగా బేకరీ పదార్థాల్లో దీన్ని బాగా వాడుతారు. అయితే వంటలలో మాత్రమే కాదు నిత్యం ఒక టీస్పూన్ మోతాదులో బేకింగ్ సోడా నీటిని తాగడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా మనకు కలిగే పలు అనారోగ్యాలను ఈ బేకింగ్ సోడా నీటితో దూరం చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బేకింగ్ సోడా సహజ సిద్ధమైన అంటాసిడ్ గుణాలను కలిగి ఉంది. ఈ క్రమంలో కొద్దిగా బేకింగ్ సోడాను తీసుకుని ఒక గ్లాస్ నీటిలో కలిపి తాగితే అసిడిటీ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. గ్యాస్ తొలగిపోతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. కడుపులోని ఆమ్లాలను సమతుల్యంలో ఉంచుతుంది.
ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి ఆ మిశ్రమాన్ని బాగా పుక్కిలిస్తే గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. గొంతులో మంట కూడా తగ్గుతుంది. కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి బేకింగ్ సోడాకు ఉంది. ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా బేకింగ్ సోడానే వేసి బాగా కలిపి ఆ నీటిని రోజూ తాగుతున్నట్టయితే కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయి. ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడాను వేసి బాగా కలిపి ఆ నీటిని రోజూ తాగాలి. దీంతో గౌట్ తగ్గిపోతుంది. దాని వల్ల వచ్చే పాదాల వాపులు, నొప్పులు తగ్గిపోతాయి. పురుగులు కుట్టిన చోట దురదగా, నొప్పిగా, మంటగా ఉండడం సహజం. దీన్ని తొలగించుకోవాలంటే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాకు కొంత నీటిని కలిపి మెత్తని పేస్ట్‌లా చేసి సమస్య ఉన్న ప్రదేశంపై రాయాలి. దీంతో ఉపశమనం లభిస్తుంది.
కొంత బేకింగ్ సోడాను తీసుకుని కొన్ని నీటిలో కలపాలి. ఆ మిశ్రమాన్ని కాటన్ బాల్ సహాయంతో శరీరంపై చెమట బాగా వచ్చే ప్రాంతాల్లో అప్లై చేయాలి. దీంతో ఆ మిశ్రమం డియోడరంట్‌గా పనిచేసి చెమట దుర్వాసన నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది. బేకింగ్ సోడా, నీరు కలిపిన మిశ్రమంతో చేతులను కడుక్కుంటే సబ్బుతో లభించే శుభ్రత లభిస్తుంది. దీంతో మురికిపోవడమే కాదు, చేతులు కూడా శుభ్రంగా మారుతాయి.