ఆధ్యాత్మికం

దేవుడిని కోరుకున్న కోరిక బయటకు చెబితే ఏమౌతుందో తెలుసా?

గుడికి వెళ్లినప్పుడైనా, ఇంట్లో పూజ చేసుకున్నప్పుడైనా దేవుడిని మనం కోరికలు కోరుకుంటూ ఉంటాం.. కోరిక చిన్నదైనా , పెద్దదైనా దేవుని కోరిన కోరిక బయటికి చెప్పకూడదు అనే మాట వింటూ ఉంటాం.. అసలు మనం కోరుకున్న కోరికను ఎందుకు బైటికి చెప్పొద్దంటారు.. దాని వెనుక ఉన్న అసలైన కారణం ఏంటి.. అలా బైటికి చెప్తే ఏం జరుగుతుంది.. అంతేకాదు గుడికి వెళ్లినప్పుడు మనం ఏం చేయాలి.. తదితర విషయాలు మీకోసం..

దేవుడిని పూజించి కోరే కోరిక.. బలీయమైనది.. కష్టమైనది.. మన వల్ల కానిది అయి ఉంటుంది.. అలాంటి కోరిక తీరిందంటే.. భగవంతుడు ఇచ్చాడంటే ఖచ్చితంగా ఏంతో ఆనందించే విషయమే అవుతుంది.. అంత సుఖించే విషయం ధనం.. సౌఖ్యం.. మంచి భర్త.. లేదా భార్య.. పదవి ఏదైనా కావచ్చు.. కోరిన కోర్కెను పైకి చెపితే విన్నవారు ఆనందంగా కనిపించినా.. లోలోన జరగకూడదని కోరుకోవచ్చు..పైకి మీ కోరిక తీరాలని మీతో చెప్పినప్పటికి మనసులో మాత్రం తీరకూడదు అని కోరుకోవచ్చు.. అలాంటి కోర్కె జరగకుండా తీరకుండా మానవ ప్రయత్నం చేయవచ్చు.. కోరిన కోరిక బయటకు చెప్పొద్దని పెద్దలు చెప్పడం వెనుకున్న కారణం ఇదే.. గుళ్లో ఏ విధంగా మసలుకోవాలో ఒకసారి చదవండి.

what happens if you tell your wish to god to out side

గుడికి వెళ్ళినప్పుడు గట్టిగా నవ్వడం, అరవడం, ఐహిక విషయాలు గురించి మాట్లాడటం చెయ్యకూడదు. గుడి పరిస‌రాలను శుభ్రంగా ఉంచాలి, కొబ్బరి పెంకులు, అరటి తొక్కలు ఎక్కడబడితే అక్కడ వెయ్యకూడదు. దర్శనం లైన్ లో తోసుకోకూడదు. దానివలన ఇతరులకు, మనకు ఇబ్బందే.. అందరూ మనతోపాటుగా దేవుడి దర్శనానికి వచ్చినవారే కాబట్టి అందరితోపాటుగా వెళ్ల‌డమే ఉత్తమం. చాలామంది దేవుడి దగ్గరకు వెళ్లగానే కళ్లుమూసుకుని దండం పెట్టుకుంటారు. కాని అలా చేయకూడదు. దేవుడిని ముందు తనివితీరా చూడాలి. అంతేకాని కళ్ళుమూసుకుని ఉండకూడదు. అంత దూరం వెళ్లింది దేవుడి దర్శనానికే కదా.. అలాంటప్పుడు కళ్లు మూసుకుంటే దేవుడి దర్శనం ఎలా అవుతుంది. తీర్ధం నిలబడే తీసుకోవాలి. ఇంట్లో అయితే తీర్ధం కూర్చొని తీసుకోవాలి.

Admin

Recent Posts