ఆధ్యాత్మికం

విగ్రహాల ఎదురుగా నిలబడి దండం పెడుతున్నారా… అయితే ఇకపై అలా చేయకండి..

మనలో చాలామందికి గుడికి వెళ్లే అలవాటుంటుంది… వెళ్లగానే రెండు చేతులు ఎత్తి దండం పెట్టుకుని మనసులో కోరికలు, బాధ‌లు దేవుడి ముందు పెట్టేస్తుంటాం… సహజంగా ప్రతి ఒక్కరు దేవుడిని ప్రార్థించుకోవడానికి విగ్రహానికి నేరుగా నిలబడతారు.. కానీ ఇలా చేయడం మంచిది కాదని సూచిస్తున్నారు పండితులు. విగ్రహానికి సూటిగా కాకుండా.. కాస్త ఎడమ లేదా కుడివైపున నిలబడి దేవుడిని ప్రార్థించుకోవడం ద్వారా దైవానుగ్రహం లభిస్తుంది.

విగ్రహాల నుంచి వెలువడే దైవకృప‌ శక్తి తరంగాల రూపంలో ప్రవహిస్తూ, భక్తుని దగ్గరకు చేరుకుంటుంది. అటువంటి సమయంలో మానవదేహం సూటిగా విగ్రహానికి నిలబడితే ఆ కిరణాలను తట్టుకోవడం అసాధ్యం… కొన్ని సందర్భాలలో అది హానికరం కూడా. కాబట్టి విగ్రహాలకు సూటిగా కాకుండా.. ఎడమ లేదా కుడివైపున నిలబడి ప్రార్థించాలి..

why we need to stand a side in temple and prey to god

మనం గమనించం కానీ చాలా గుళ్లల్లో విగ్రహానికి ముందు భాగం ఖాళీగా ఉండి ఒకపక్కనుండి వెళ్తూ దేవుడికి దండం పెట్టుకుని మరొక పక్కనుండి బైటికొచ్చేలా ఏర్పాటు ఉంటుంది..దీని ద్వారా మనం ఎదురుగా కాకుండా పక్కగానే ఉండి దండం పెట్టుకున్నప్పటికీ , విగ్రహం ముందుకు వెళ్లగానే మళ్లీ అక్కడా నిలబడి దండం పెట్టుకుంటాం..ఇకపై అలా చేయకండి… దేవుడిని ప్రార్థించే సమయంలోరెండు చేతులను జోడించి దేవుడిని స్మరించుకుంటాం. ఇలా జోడించడం వల్ల మెదడుకు ప్రాణశక్తి లభిస్తుంది. దాంతో శారీరకబలం, బుద్ధిబలం, ఆత్మవిశ్వాసంతోపాటు ఎంతో ఆరోగ్యకరంగా కూడా వుంటారు.

Admin

Recent Posts