పసికందులు, చిన్న పిల్లలు అంటే అందరికీ ఇష్టమే. వారిని చూస్తే ఎవరైనా… అబ్బా… చూడండి ఆ పాప ఎంత బాగుందో, ఆ బాబు ఎంత ముద్దొస్తున్నాడో..! అని ఎవరైనా అంటారు. అయితే అలా వారు బయటికి అన్నా, లోపలికి అనుకున్నా పిల్లలకు దిష్టి తాకుతుందని మన పెద్దలు నమ్ముతారు. అవును, చాలా మంది దిష్టి నమ్ముతారు. అందులో భాగంగానే పిల్లలకు దిష్టి తీస్తారు. అయితే దిష్టి తీయడంతోపాటు పిల్లలకు నల్ల చుక్క పెడతారు. దాంతో ఏం జరుగుతుందంటే…
పిల్లలకు నల్లని దిష్టి చుక్క పెట్టడం వల్ల వారికి దిష్టి తగలదట. అంతేకాదు, ఎవరైనా అలాంటి పిల్లలను చూడగానే వారి దృష్టి ముందుగా ఆ చుక్క మీదకు వెళ్తుందట. దీంతో పిల్లలకు దిష్టి తగలదని వారి నమ్మకం. ఈ క్రమంలో పిల్లలకు నెగెటివ్ ఎనర్జీ కాకుండా పాజిటివ్ ఎనర్జీ ప్రసారమవుతుందట. దాంతో వారి ఆరోగ్యం బాగుంటుందని నమ్ముతారు.
అయితే పిల్లలకు దిష్టి చుక్క పెట్టడం మాత్రమే కాదు ఇంకా పలు రకాలుగా చేయడం వల్ల కూడా వారికి దిష్టి తగలకుండా జాగ్రత్త పడవచ్చు. అదెలాగంటే… ఎరుపు, నలుపు, తెల్ల అన్నం మూడు ముద్దలు చేసి వాటితో ఆదివారం దిష్టి తీసి పారేస్తే దిష్టి పోతుంది. మిరపకాయలను చుట్టూ మూడు సార్లు తిప్పి థూ… థూ… ధూ… అని వాటిలో ఊసినా దిష్టి పోతుంది. చీపురు, కాళ్ల చెప్పులు రెండూ అలాగే వాడి దిష్టి తీసినా దిష్టి పోతుంది. మెడలో నల్లని దారం వేసినా, చేతికి లేదా కాళ్లకు నల్లని దారం కట్టుకున్నా దిష్టి తగలదు.