ఆధ్యాత్మికం

దుర్గాదేవి పూజ‌లో నిమ్మకాయ దండ‌ల‌నే ఎందుకు ఉప‌యోగిస్తారు.. వాటి ప్రాముఖ్య‌త ఏమిటి..?

దుర్గాదేవి ఆరాధనలో నిమ్మకాయల పూజకు, నిమ్మకాయ దండలకు ప్రాధాన్యత ఉండడం తెలిసిందే! అయితే లక్ష్మి సరస్వతి దేవతలకు కాకుండా కేవలం దుర్గాదేవికి మాత్రమే నిమ్మకాయల దండ సమర్పించడం వెనుక ఉన్న అంతరార్ధం ఏమిటి? ఇలా నిమ్మకాయల దండ సమర్పిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సాధారణంగా దుర్గాదేవికి నిమ్మకాయల దండలు వేసి పూజిస్తూ ఉంటాం. ఇలా నిమ్మకాయల దండలు అమ్మవారికి మాత్రమే ఎందుకు వేస్తారు? అసలు ఈ ఆచారం ఎందుకు ప్రారంభం అయ్యింది? హిందూ సంప్రదాయంలో లక్ష్మీ దేవికి, సరస్వతీ దేవికి ఇలాంటి నిమ్మకాయ దండలు వేసే ఆచారం కనిపించదు. కానీ శక్తి ఆలయాల్లో, గ్రామదేవతల ఆలయాల్లో ఈ ఆచారం కనిపిస్తుంది.

అమ్మ‌వారు శక్తి స్వరూపిణి. సమస్త ప్రాణికోటిని ఆ తల్లి ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. అమ్మవారు అనునిత్యం శత్రుసంహారాన్ని, లయత్వాన్ని నిర్వహిస్తుంటుంది. దుష్టశక్తుల పాలిట‌ సింహస్వప్నం అయిన దేవికి కొంత తామస గుణం ఉంటుంది. దేవి సత్వ సరూపమే అయినా ఆ తల్లి సంహార క్రియ నిర్వహించేప్పుడు తామస ప్రవృత్తిని ప్రదర్శిస్తుంది. గ్రామ దేవతలు కూడా ఆ దేవీ స్వరూపాలే! గ్రామదేవతలు గ్రామాలకి రక్షణగా ఉండటానికి రాత్రిపూట గ్రామ సంచారం చేస్తూ, దుష్ట శిక్షణ చేస్తారు. శక్తిస్వరూపిణి అయిన అమ్మవారి వీరత్వాన్ని ప్రతిబింబించేవే ఈ నిమ్మకాయల దండలు. అమ్మవారికి నిమ్మకాయ దండలని సమర్పించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. శత్రు సంహారం కోసం రౌద్ర , తామస స్వరూపిణి అయిన దేవికి, ఆమెకి ఇష్టమైన నిమ్మకాయల దండనీ, పులుపుగా ఉండే పులిహోర వంటి నైవేద్యాన్ని సమర్పిస్తే ఆ తల్లి శాంతిస్తుందని చెబుతారు. అందువల్లే అమ్మవారికి నిమ్మకాయల దండలు వేస్తారు.

why do we offer lemon garland for durga devi

మంగళవారం, శుక్రవారం అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించడం శుభప్రదం. అయితే అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించే సంప్రదాయాన్ని ఇళ్లల్లో చేసుకొనే పూజల్లో పాటించకూడదని గుర్తుంచుకోవాలి. ఇంట్లో మనం చేసుకునే పూజలో సాత్విక తత్వం ఉంటుంది. అయితే నిమ్మకాయల దండ సమర్పించడంలో తాంత్రికపరమైన అర్థాలు కూడా ఉన్నందున ఇలాంటి ఆచారాన్ని ఇంట్లో చేసుకొనే పూజల్లో పాటించకపోవడమే మంచిది. ఆలయంలో దుర్గాదేవి కోసం నిమ్మకాయల దండని తయారు చేసి, గుడిలో అమ్మవారికి సమర్పించి, అర్చన చేయించుకొని, అమ్మవారి ప్రసాదంగా ఆలయం నుంచి రెండు మూడు నిమ్మకాయలు తెచ్చుకొని, గుమ్మానికి కట్టుకుంటే నరఘోష, ద్రుష్టి దోషాలు, శత్రుపీడలు తొలగిపోతాయి. అలాగే మన ఇల్లు అమ్మ రక్షణలో ఉన్నందువల్ల, దుష్ట శక్తులు దరి చేరకుండా ఉంటాయి. చివరగా ఈ నిమ్మకాయల దండని కేవలం పరాశక్తికి మాత్రమే వినియోగించాలి. అంతేగానీ లక్ష్మీ దేవికి, సరస్వతి దేవికి ఈ ఆచారం వర్తించదని గుర్తుంచుకోవాలి.

Admin

Recent Posts