బొడ్డు అనగానే ఇదేదో శృంగారానికి సంబంధించిన అంశం అనుకునేరు. కానే కాదు. ఎందుకంటే ఇది బొడ్డు గురించి పలు విషయాలను తెలిపే ఆసక్తికర కథనం. అవును. ఇంతకీ బొడ్డు గురించి తెలుసుకోవాల్సింది ఏముంటుంది..? అనే కదా మీ డౌట్..! ఏమీ లేదండీ.. మనలో చాలా మందికి బొడ్డు రక రకాలుగా ఉంటుంది కదా. ఏ ఇద్దరికీ ఒకే రకంగా బొడ్డు ఉండదు. కొందరికి లోపలికి ఉంటే కొందరికి బయటకు ఉంటుంది. ఇంకొందరికి మరోలా ఉంటుంది. అయితే ఇలా ఎందుకు ఉంటుందో తెలుసా..? అదే ఇప్పుడు చూద్దాం.
బొడ్డు బయటకు ఉంటే దాన్ని outie అంటారు. అదే లోపలికి ఉంటే దాన్ని innie అంటారు. అయితే నిజానికి ఇవి పుట్టుకతోనే రావు. అవి ఎలా వస్తాయంటే.. శిశువు జన్మించినప్పుడు తల్లి నుంచి పెనవేసుకునే బొడ్డు తాడును కట్ చేస్తారు కదా. ఈ క్రమంలో బొడ్డు వద్ద గాయం అవుతుంది. అది చాలా కాలం తరువాత మానుతుంది. అదే సమయంలో ముందు చెప్పిన ఔటీ, ఇన్నీలు ఏర్పడతాయి. అయితే బొడ్డు చుట్టూ శరీరం బాగా త్వరగా పెరిగితే దాంతో ఇన్నీ వస్తుంది. అంటే బొడ్డు లోపలికి వెళ్తుంది. అలా కాకుండా బొడ్డు చుట్టూ శరీరం ఆలస్యంగా పెరిగితే అప్పుడు బొడ్డు బయటకు వస్తుంది.
పైన చెప్పిన ఇన్నీ, ఔటీలే కాక బొడ్డు ఇంకా రక రకాలుగా ఉంటుంది. అయితే ఏ రకంగా ఉన్న బొడ్డు ఏర్పడడం అనేది శిశువుగా ఉన్నప్పుడే జరుగుతుంది. అంతే కానీ పుట్టుకతోనే అలా రాదు. అయితే కొన్ని సందర్భాల్లో శిశువు బొడ్డు మరీ లోపలికి వెళ్తుంటుంది. దీన్ని umbilical hernia అని పిలుస్తారు. ఇక కొందరికైతే బొడ్డు మరీ బయటకు వస్తుంది. చాలా పెద్ద గడ్డలా బయటకు వచ్చి కనిపిస్తుంది. కానీ ఇది వ్యాధి ఉన్నంత కాలం ఉంటుంది. లేదంటే కొన్ని సందర్భాల్లో జీవితాంతం ఉండవచ్చు. ఇలా బొడ్డు ఉండే చాలా మంది 2005 లో పెద్ద ఎత్తున సర్జరీలు చేయించుకున్నారట. నిజంగా ఇదొక వండర్. ఇక చివరిగా మరొక విషయం ఏమిటంటే… గర్భిణీలకు నెలలు పెరుగుతున్న కొద్దీ బొడ్డు బయటకు వస్తుంది. తరువాత డెలివరీ అయ్యాక నార్మల్ అవుతుంది. ఇలా కూడా బొడ్డు సైజ్, షేప్‌లలో మార్పు వస్తుంది. ఏది ఏమైనా బొడ్డు గురించిన ఈ విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి కదూ..!