వినోదం

చిరంజీవికి రామ్ చరణ్ హీరో అవటం ఇష్టం లేదట ! రామ్ చరణ్ ఏమవ్వాలని అనుకున్నారంటే ?

రామ్ చరణ్ చిరుత సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఈ సినిమా తర్వాత చరణ్, రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమాలో నటించారు. ఈ సినిమా సంచలనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాతో చరణ్ కు అభిమానులు పెరిగిపోయారు. అంతేకాకుండా రామ్ చరణ్ రెండో సినిమాతోనే స్టార్ స్టేటస్ ను అందుకున్నాడు. ఇక ఆ తర్వాత తిరిగి వెనక్కి చూసుకోలేదు.

వ‌రుస సినిమాలతో చరణ్ ఫుల్ బిజీ అయ్యాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాతో నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాకు ముందు రామ్ చరణ్ నటన పై విమర్శలు వచ్చేవి. కానీ ఈ సినిమాలో నటనతోను మెప్పించాడు. ఇక ఆర్ఆర్ఆర్ తో మరో సక్సెస్ అందుకున్నాడు. పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అయితే నిజానికి చిరంజీవికి మొదట రామ్ చరణ్ ను సినిమాల‌లోకి తీసుకురావడం ఇష్టం లేదట.

chiranjeevi did not want ram charan to be actor

సినిమాల్లో పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవని, పైకి ఎదుగుతుంటే తొక్కేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారని అనుకున్నారట. అంతే కాకుండా చరణ్ ను డాక్టర్ చేయాలని చిరు అనుకునేవారట. అయితే చరణ్ చదువులో యావరేజ్ స్టూడెంట్ అవడం, హీరో అవుతానని చెప్పడంతో కొడుకు కోరిక మేరకు ఒప్పుకున్నారట. ఇక చరణ్ ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు.

Admin

Recent Posts