వినోదం

ఓకే ఫ్రేమ్ లో ముగ్గురు టాలీవుడ్ లెజెండ్స్ సతీమణులు!

తెలుగు ఇండస్ట్రీలోనే తన అద్భుతమైన నటనతో విశ్వవిఖ్యాత నట సార్వభౌమంగా పేరు తెచ్చుకున్నారు అన్న ఎన్టీఆర్. ఏ పాత్రలో అయినా ఇట్టే దూరిపోయే కళాశక్తి ఆయన సొంతం. ఆయన పౌరాణిక సినిమాలు చేశాడు అంటే ఆ పాత్రకి కొత్త అందం వస్తుంది. రాముడు, దుర్యోధనుడు వంటి పాత్రలు చూస్తే నిజంగానే దేవుడు కొలువై వచ్చాడా అని అనిపిస్తుంది. అయితే ఈ ఫ్రేమ్ లో ఉన్న ముగ్గురు మహిళలు తెలుగు సినీ ఇండస్ట్రీని ఏలిన ముగ్గురు లెజెండ్స్ భార్యలు. చెన్నైలో జరిగిన ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో కలిసి దిగిన ఫోటో ఇది.

1933 లో పుట్టిన అన్నపూర్ణ, 1949 ఫిబ్రవరి 18న అక్కినేని నాగేశ్వరరావు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. కుమారుల్లో నాగార్జున సినిమా హీరో కాగా, వెంకట్ సినీ నిర్మాత.

have you identified these 3 women in this photo

1942లో ఎన్టీఆర్, బసవతారకంల వివాహం జరిగింది. వీరికి 12 మంది సంతానం. 8 మంది కుమారులు, నలుగురు కుమార్తెలు. రామకృష్ణ (సీనియర్) జయకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ రామకృష్ణ (జూనియర్), జయశంకర్ కృష్ణ కుమారులు కాగా, గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరి, కంఠమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు.

వీరమాచినేని వసుంధర దేవి, ప్రముఖ నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ భార్య, జగపతిబాబు వీరి కుమారుడె, వీరికి జగపతిబాబుతో కలిసి మరో ఇద్దరు పిల్లలు.

Admin

Recent Posts