వినోదం

త్రివిక్రమ్ సినిమాల్లో మనకు తప్పకుండా కనపడే ఈ వ్యక్తి ఎవరు ? అయన బ్యాక్ గ్రౌండ్ ఇదే..

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పనిలేదు. ఇతని సినిమాలలో స్టైలిష్ టేకింగ్, హెల్దీ కామెడీ తో పాటు అద్భుతమైన డైలాగులు కూడా ఉంటాయి. రొటీన్ కథనే అయినప్పటికీ తనదైన శైలిలో ప్రజెంట్ చేసి హిట్లు అందుకోవడంలో త్రివిక్రమ్ దిట్ట. తన సినిమాలతో అన్ని వర్గాల వారిని అలరిస్తూ టాప్ దర్శకుల లిస్టులో చేరిపోయారు త్రివిక్రమ్.

ఈయన దర్శకత్వంలో వచ్చిన జులాయి, అతడు, అత్తారింటికి దారేది, అల వైకుంఠపురం సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇక సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో క‌లిసి గుంటూరు కారం సినిమాను తెర‌కెక్కించాడు. కానీ ఈ మూవీ యావ‌రేజ్ టాక్‌తో స‌రిపెట్టుకుంది. ఇది ఇలా ఉండగా… టాలీవుడ్‌ నటుడు… పమ్మి సాయి గురించి తెలియని వారుండరు. పమ్మి సాయి.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రధానంగా పనిచేశాడు.

do you know about pammi sai in trivikram movies

ముఖ్యంగా త్రివిక్రమ్‌ సినిమాలో పమ్మి సాయి ఎక్కువగా కనిపిస్తాడు. పమ్మి సాయి అతడు (గ్లాస్ మార్చండి రా… అనే పాపులర్ డైలాగ్), జల్సా, ఖలేజా, జులాయి (నేను 12 కొట్టను, అరుస్తున్నానని చెప్పే వ్యక్తిగా), అత్తారింటికీ దారేదీ, సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి, అఆ, అరవింద సమేతా, సినిమాల్లో నటించాడు పమ్మి సాయి. అంతేకాదు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్..దర్శకత్వం చేసిన 11 సినిమాల్లో 10 సినిమాలలో పమ్మి సాయి ఉంటాడు. అయితే..పమ్మి సాయికి త్రివిక్రమ్‌ దూరపు బంధువు, మంచి పరిచయం ఉన్న వ్యక్తట. అందుకే పమ్మి సాయిని ప్రతీ సినిమాలో పెట్టుకున్నారు త్రివిక్రమ్‌.

Admin

Recent Posts