వినోదం

రాజమౌళి సినిమాల్లో ఛత్రపతి శేఖర్ తప్పకుండా ఉండాల్సిందేనట ఎందుకంటే ?

తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఇప్పుడు దేశమంతా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన తెరకెక్కించిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలు నేషనల్ వైడ్ గా సంచలనం సృష్టించాయి. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ తో రాజమౌళి రేంజ్ పెరిగిపోయింది. ఆయన మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ అయినా సరే అది మాత్రం మంచి గుర్తింపు వచ్చే విధంగా ఆయన దాన్ని చిత్రీకరించే విధానం హైలైట్ గా నిలుస్తుంది. అలాంటి ఆయన చేసిన శాంతినివాసం సీరియల్ నుంచి మొన్న చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా వరకు ఓ నటుడు మాత్రం రెగ్యులర్ గా ఆయన సినిమాలలో కనిపిస్తూ ఉంటాడు. ఆయనే నటుడు శేఖర్.

ఈయన రాజమౌళి తీసిన శాంతి నివాసం సీరియల్ నుంచి ఆర్ఆర్ఆర్ సినిమా వరకు దాదాపుగా అన్ని సినిమాలలో మనకు కనిపిస్తారు. రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 సినిమా నుంచి మొదలుకొని.. సింహాద్రి, సై, చత్రపతి, విక్రమార్కుడు, మగధీర, మర్యాద రామన్న, ఈగ, ఆర్ఆర్ఆర్ ఇలా రాజమౌళి తెరకెక్కించిన 12 సినిమాలలో 9 సినిమాలలో నటించాడు శేఖర్. చత్రపతి సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ రోల్ లో నటించిన శేఖర్ కి ఆ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. దీంతో ఆయన పేరు కూడా చత్రపతి శేఖర్ గా మారిపోయింది. ఈ చిత్రంలో ఆయన చేసిన భద్రం పాత్ర చాలా పాపులర్ అయిందనే చెప్పాలి. ఇక రాజమౌళి సినిమాలలో శేఖర్ నటించనివి.. యమదొంగ, బాహుబలి 1& 2, చిత్రాలలో మాత్రం కనిపించలేదు.

do you know that chatrapathi shekhar must appears in rajamouli films

అయితే ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్లలో ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు శేఖర్. రాజమౌళి సీరియల్ డైరెక్టర్ గా ఉన్నప్పటి నుంచే తనతో పరిచయం ఉందని.. తాను ఎప్పుడు రాజమౌళిని అవకాశాలు అడగనని, సపోర్టు చేయాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో రాజమౌళి తనకి సినిమాలలో అవకాశాలు ఇస్తూ ఉంటారని చెప్పుకొచ్చారు. అయితే రాజమౌళి సినిమా మొదలు పెట్టాక తనని పిలుస్తాడని.. అప్పటివరకు తనకి సినిమాలో తాను పోషించే పాత్ర ఏంటో కూడా తెలియదని పేర్కొన్నారు. రాజమౌళి తన సినిమాలలో కనీసం ఒక్క చిన్న క్యారెక్టర్ అయినా ఆయన కోసం రాసుకుంటారంటే వీరి మధ్య అంత ఫ్రెండ్షిప్ ఉందన్నమాట.

Admin

Recent Posts