వినోదం

ఈ నటి ఏపీ మాజీ సీఎం మనవరాలు అని మీకు తెలుసా.. చదువులో కూడా టాపే..?

బుల్లితెర నటులలో జ్యోతి రెడ్డి అంటే తెలియని వారు ఉండరు.. ఈవిడ సీరియల్స్ లో విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గర అయింది. ఈమె ఎక్కువగా ప్రతి నాయకురాలు పాత్రల్లో నటించింది. తొమ్మిదవ ఏట ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె 30 సంవత్సరాలకు పైగా నటిగా రాణిస్తోంది. అయితే ఈవిడ ఏపీ మాజీ సీఎం భవనం వెంకటరామిరెడ్డి మనవరాలని చాలామందికి తెలియదు..

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన జ్యోతి రెడ్డి ఈ విషయాలను పంచుకుంది.. తాను ఏపీ మాజీ సీఎం భవనం వెంకటరామిరెడ్డి మనవరాలు నని, చిన్నతనం నుంచే చదువులో ముందుండే దాన్ని అని ఎం ఏ ఎన్ఫీల్డ్ వరుసగా మూడుసార్లు గోల్డ్ మెడల్ సంపాదించినట్టు తెలియజేసింది.

do you know that jyothi reddy is from big royal family

తనకు ఉద్యోగం చేయాలని ఉండేదని, కానీ పెద్ద పెద్ద డైరెక్టర్లు తమ ప్రాజెక్టులలో నటించమని వారి పీఏ లని ఇంటికి పంపించేవారని, అది చూసి తన తల్లి అంత గొప్ప వాళ్ళు నటించమని అడిగితే వద్దంటావేంటి అంటూ ప్రోత్సహించిందని చెప్పుకొచ్చింది. తన తల్లి వల్లే యాక్టింగ్ ఫీల్డ్ లోకి అడుగు పెట్టానని అన్నది. షూటింగ్లో ఉన్నంతసేపు అందరూ స్నేహితులే, షూటింగ్ నుంచి ఇంటికి వెళ్ళాక ఎవరితో టచ్ లో ఉండనని తెలియజేసింది.

Admin

Recent Posts