వినోదం

“అనుష్క” గురించి చాలామందికి తెలియని 15 ఆసక్తికర విషయాలివే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">&OpenCurlyQuote;ఎవడు పడితే వాడు రావడానికి&comma; ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డా&period;&period; &OpenCurlyQuote;భాగమతి’ అడ్డా&period;&period; అంటూ &period;&period;భాగమతిగా అనుష్క ప్రేక్షకుల ముందుకొచ్చేసి సూపర్ హిట్ టాక్ తెచ్చేసుకుంది&period;తెలుగులో స్టార్ హీరోలతో సమానంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఎవరన్నా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా అనుష్కే&period;&period;ఒక అరుంధ‌తి&comma; ఒక రుద్రమదేవి&comma; ఒక సైజ్ జీరో&period;&period; అనుష్క ఏది చేసినా ఢిఫరెంటే&period;&period; అసలు అనుష్క సినిమా కెరీర్ ఎలా ప్రారంభమయింది…ఇక్కడివరకూ ఎలా వచ్చింది&period;&period;ఇంకా మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అనుష్క అసలు పేరు స్వీటి శెట్టి&period;&period;సినిమాల్లోకి వచ్చాక అనుష్కగా మారింది&period;&period;బేసిగ్గా అనుష్క చాలా సిగ్గరి&period; సినిమాల్లోకి రాకముందు యోగా ట్రైనర్ గా ఉన్న అనుష్క సినిమాల్లోకి వస్తాననే ఎప్పుడు అనుకోలేదట&period; నటన&comma;డ్యాన్స్ అనేవి తెలియకపోయినా ఈ స్థాయికి రావడం వెనుక గల ఏకైక కారణం తన హార్డ్ వర్క్&period; సినిమాల్లో కనపడే అనుష్క బైట ఆడియో ఫంక్షన్స్ ఇతర ఫంక్షన్స్ లో కనపడే అనుష్కకి చాలా తేడా ఉంటుంది&period; ముఖ్యంగా దుస్తుల విషయంలో&period;&period; కేవలం పాత్ర ప్రాధాన్యతను బట్టి దుస్తులు ధరించే అనుష్క బైట మాత్రం చాలా సింపుల్ గా ఉండడానికి ఇష్టపడుతుంది&period; స్కర్ట్స్&comma; వెస్ట్రన్ వేర్ ని ఇష్టపడని అనుష్క ఎక్కువగా చీరలు&comma; చుడీదార్స్ లోనే దర్శనమిస్తుంది&period; బంగారాన్ని కూడా ఎక్కువగా ఇష్టపడదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72185 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;anushka-shetty-1&period;jpg" alt&equals;"do you know these important facts about anushka shetty " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫస్ట్ టైం పూరిజగన్నాద్ ఏదన్నా ఫోటో ఇవ్వమని అడిగితే పర్స్ లో నుండి పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తీసి ఇచ్చిందట&period;&period; దానికి పూరి పెద్దగా నవ్వి &period;&period; సూపర్ ఆడిషన్ కి రమ్మని ఇన్వైట్ చేస్తే&period;&period; ఫోటోకి ఎలా పోజ్ ఇవ్వాలో తెలియని అనుష్కకి నాగార్జునే నేర్పించారట&period;&period; అప్పటి నుండి ఇప్పటివరకు అనుష్క వెనుదిరిగి చూసింది లేదు&period; సినిమాల్లో ఎంతో ధైర్యశాలిగా కనపడే అనుష్కకి ఎత్తైన ప్రదేశాలంటే భయం&period; బిల్లా సినిమాలో ఎత్తునుండి దూకాల్సిన స్టంట్ చేసేప్పుడు భయపడ్డమే కాదు&period;&period; చేశాక ఒకటే ఏడుపట&period;&period; ఇంటికెళ్లాక కూడా ఆ సంఘటన మర్చిపోకుండా ఏడ్చిందట అనుష్క&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సరోజ క్యారెక్టర్ ని నెరేట్ చేయడానికి వెళ్లిన క్రిష్ చెప్పడానికి సంశయించారట&period; కానీ అనుష్కే చొరవ తీసుకుని చెప్పండి పర్లేదు అంటే&period;&period; నెరేట్ చేసాడట క్రిష్&period;&period; వెంటనే యాక్సెప్ట్ చేసిందట అనుష్క&period;&period; ఆ తర్వాత ఆ క్యారెక్టర్ అనుష్క కి ఎంత మంచి పేరు తెచ్చిపెట్టిందో చెప్పక్కర్లేదు కదా&period; ఇప్పటివరకూ మూడు సార్లు ద్విపాత్రాభినయం చేసింది అనుష్క&period; &period;ఆ మూడు సినిమాలు అరుంధ‌తి&comma; పంచాక్షరి&comma; వర్ణ&period;&period; రాజమౌళితో ఒకటి కంటే ఎక్కువ సినిమాల్లో నటించింది కూడా అనుష్కనే&period; ఒకటి విక్రమార్కుడు&comma; రెండు బాహుబలి&period; ఇప్పటివరకూ మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు&comma; రెండు నంది అవార్డులు &comma; మూడు సినెమా అవార్డులు అందుకుంది అనుష్క&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-72186" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;anushka-shetty&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫోన్ తక్కువగా వాడుతుందట&period;&period;న్యూస్ కి &comma; సోషల్ మీడియాకి దూరంగా ప్రశాంతమైన జీవితం గడపాలనుకుంటుందట అనుష్క&period; టాలివుడ్లో అధిక పారితోషికం తీసుకున్న నటి అనుష్కే&period; అరుంధ‌తి సినిమా ముందు వరకూ కూడా గ్లామర్ రోల్స్ పోషించింన అనుష్క అరుంధ‌తి పాత్ర చేయడానికి భయపడితే &comma; దర్శకుడు కోడి రామకృష్ణ&comma; నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి మాత్రం నువ్ మాత్రమే చేయగలవ్ అని నమ్మేవారట&period; ఆ తర్వాత ఒక్కో సీన్ కి రీటేక్ లు తీసుకుంటూ సీన్ ఫర్ఫెక్ట్ గా వచ్చేంతవరకు కష్టపడేదట&period;&period; తనతో పాటు సినిమా టీం కూడా…రూ&period;13 కోట్లతో నిర్మించబడిన ఈ సినిమా 34 కోట్లు వసూలు చేసింది&period; ఇప్పటికీ టాప్ 4 సినిమాల్లో అరుంధ‌తి ఉంటుంది&period; భాగమతి స్క్రిప్ట్ ఎప్పుడో విన్నప్పటికీ ఐదేండ్ల తర్వాత డేట్స్ ఇచ్చిందట అనుష్క&period;&period; అన్నేండ్ల తర్వాత సినిమా సెట్స్ మీదికెళ్లేముందు ఏ క్వశ్చన్ అడగకుండానే యాక్సెప్ట్ చేసిందట&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నటజీవితానికి స్వస్తి చెప్పాక చిన్నపిల్లలకు పాఠాలు చెప్తూ బతకాలనుకుంటుందట&period; ప్రయాణాలంటే కూడా అనుష్కకి ఇష్టం&period; బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్&comma; అభిషేక్ బచ్చన్ ని ఎక్కువగా ఇష్టపడుతుంది&period; ఫ్రెంచ్ మూవీస్ లో నటించాలనేది అనుష్క కోరిక&period;&period; డిఫరెంట్ స్టోరీ&comma; తన పాత్రకు ప్రాధాన్యం ఉంటే హిందీ&comma; ఫ్రెంచి భాషల్లో నటిస్తుందట&period; అనుష్క అంటే చాలా మంచి నటి అని మనం అనుకుంటాం కానీ ఇప్పటికీ తనకొచ్చే ప్రతి పాత్రనుండి నటనను నేర్చుకునే దశలోనే ఉన్నానంటుంది&period; రుద్రమదేవి సినిమాలో హార్స్ రైడింగ్ సన్నివేశంలో నటించేప్పుడు కూడా అనుష్క చాలా భయపడిందట&period;&period; సూపర్ నుండి భాగమతి వరకూ ఏన్నో ప్రాధాన్యత ఉన్న పాత్రలు పోషించింది అనుష్క &period; దేవసేన&comma; రుద్రమదేవి&comma; భాగమతి &comma; అరుంధ‌తి ఈ పేర్లు వింటే చాలు ప్రేక్షకుల కళ్లముందు అనుష్కే కనపడుతుందంటే తన నటనతో ఎంతగా మెప్పించిందో అర్దం చేసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts