వినోదం

ఇండస్ట్రీ హిట్ మూవీస్ ను మిస్ చేసుకున్న పదిమంది హీరోలు… ఎవరంటే…?

ఏ హీరో హీరోయిన్ కైనా సినిమా ఇండస్ట్రీలో ఒక్క హిట్ కొడితే కలిగే ఆనందం కంటే ఏది ఎక్కువ కాదు. ఒక్కోసారి ఒక్క ఇండస్ట్రీ హిట్ తోనే స్టార్ హీరోలుగా మారిన హీరోలు, హీరోయిన్లు, నటినట్లు ఉన్నారు. కొంతమంది ఇండస్ట్రీ హిట్ కోసం ఎదురుచూస్తున్న వారు ఉన్నారు. అలా తెలుగు సినిమా చరిత్రలో ఇండస్ట్రీ హిట్ కొట్టిన సినిమాలను వదులుకున్న స్టార్ హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. అలనాడు ఎన్టీఆర్ కు పాతాళభైరవి మూవీ ఇండస్ట్రీలోనే తిరుగులేని హిట్ ఇచ్చింది. కానీ ఈ సినిమాకు ముందు అనుకున్న హీరో ఏఎన్ఆర్. పాతాళ భైరవి మూవీ తర్వాత వచ్చింది దేవదాస్ మూవీ. విచిత్రంగా పాతాళభైరవిని ఏఎన్ఆర్ వదులుకుంటే, దేవదాస్ మూవీని ఎన్టీఆర్ వదులుకున్నారు. ఈ మూవీని ఏఎన్ఆర్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు.

ముందుగా అడవి రాముడు సినిమా శోభన్ బాబు వద్దకు వెళ్లిందట. కానీ ఆయనకు డేట్స్ కుదరకపోవడంతో ఆయన ఎన్టీఆర్ పేరు చెప్పారట. ఈ మూవీని ఎన్టీఆర్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. పసివాడి ప్రాణం మూవీని ముందుగా సూపర్ స్టార్ కృష్ణ చేయాలనుకున్నారట. కానీ ఏవో కారణాలవల్ల మిస్ అవ్వడంతో చిరంజీవి చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. గ్యాంగ్ లీడర్ చిత్రానికి ముందుగా నాగబాబుతో చేద్దామని కథ రెడీ చేశారట. కానీ ఏవో కారణాల వల్ల ఈ మూవీ చిరంజీవికి వెళ్ళింది. ఇండస్ట్రీ హిట్ అయింది. చంటి మూవీని ముందుగా రాజేంద్రప్రసాద్ తో చేద్దాం అనుకున్నారట. కానీ చివరికి వెంకటేష్ ఈ చిత్రానికి ఫైనల్ అయ్యారు. ఈ మూవీ వెంకటేష్ కెరియర్ నే మార్చేసింది. యాక్షన్ సినిమాలు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది బాలకృష్ణ. అయితే బాలకృష్ణ చేసిన సమరసింహారెడ్డి ముందుగా వెంకటేష్ వద్దకు వెళ్లిందట. కానీ ఆయనకు కుదరకపోవడంతో బాలకృష్ణ చేసి సూపర్ హిట్ కొట్టారు.

do you know who missed to do these industry hit movies

తెలుగు ఇండస్ట్రీలో సూపర్ హిట్ కొట్టిన కలిసుందాం రా మూవీ ముందుగా నాగార్జునకి వెళ్లిందట. కానీ ఆయనకు వేరే సినిమా డేట్స్ ఉండడంతో వెంకటేష్ సినిమా చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. నువ్వే కావాలి మూవీకి ముందు అనుకున్న హీరో సుమంత్. ఏం జరిగిందో ఏమో కానీ మళ్ళీ అది తరుణ్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. తెలుగు సినిమా చరిత్రలోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన మూవీ పోకిరి. ఈ మూవీని ముందుగా రవితేజతో చేద్దాం అనుకున్నారట పూరి జగన్నాథ్. కానీ రవితేజకి డేట్స్ కుదరకపోవడంతో మహేష్ బాబు చేశారు.

Admin

Recent Posts