వినోదం

చిరంజీవిని నా పక్కనే కూర్చుంటావా..? అని అవమానించిన హీరోయిన్ ఎవరంటే ?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి, మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు ఛాన్సులు రాక ఆపసోపాలు పడ్డారు. కానీ ఎక్కడా కూడా వెనుకడుగు వేయకుండా తాను ఎంచుకున్న దారిని వదలకుండా ముందుకు సాగారు. తన అవమానాలను ఇతరులతో కూడా చర్చించకుండా తన లోపల దాచుకుని ముందుకు వెళ్లేవారట. అలాంటి చిరంజీవి మరియు మాధవి కలిసి ఒక సినిమాలో నటిస్తున్న సమయంలో ఆయన్ను తీవ్రంగా అవమానించిందట.

మాధవి అప్పటికే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అయితే వీరిద్దరూ కలిసి ఒక సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. షూటింగ్ అయిపోయాక వీరిద్దరికీ వేర్వేరు హోటల్స్ లో బస ఏర్పాటు చేశారు. మరునాడు షూటింగ్ లొకేషన్స్ కు రావాలని నిర్మాత తన కారును పంపించారట. ముందుగా కారు హీరోయిన్ మాధవి ఉండే హోటల్ కి వెళ్లి తీసుకువచ్చారు. ఇక వచ్చే దారిలోనే చిరంజీవి ఉండే హోటల్ ఉంది. ఆ హోటల్ వద్దకు రాగానే చిరంజీవి కూడా మాధవి పక్కనే కూర్చున్నారు.

do you know that once actress madhavi insulted chiranjeevi

వెంటనే మాధవి మీరు నా పక్కన వద్దు ముందుకు వెళ్లి కూర్చోండి అందట. అలా ప్రతిరోజు మాధవి వెనక సీట్లో కూర్చుంటే చిరంజీవి ముందు సీట్లో కూర్చునేవారట. అలా చిరంజీవి ఆమె అవమానించిందని పట్టించుకోకుండా స్టార్ గా ఎదగాలనే కసితో ముందుకు సాగారు. పట్టుదలతో స్టార్ హీరోగా ఎదిగారు. ఆ తర్వాత మాధవికి అవకాశాలు తగ్గిపోయాయి. ఎంతో మంది స్టార్ హీరోయిన్లు కూడా చిరంజీవితో ఒక్కసారి నటించాలని అనుకునే స్థాయికి వచ్చారు. అలా చిరంజీవిని, మాధవి అవమానించిందని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు చిరంజీవి.

Admin

Recent Posts