vastu

పొరపాటున కూడా ఇంట్లో ఈ మొక్కలు నాటితే దరిద్రం కొలువైనట్టే..!!

సాధారణంగా చాలామంది ఇంటి చుట్టూ పరిసరాల్లో మొక్కలు నాటుతూ ఉంటారు. ఈ విధమైన మొక్కలు నాటడం గ్రామాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతం పట్టణాల్లో కూడా ఇంటి వరండాలో ఇతర ఖాళీ ప్లేస్ లో మొక్కలను పెంచుతున్నారు.. మొక్కలను పెంచడం వల్ల బాగుండడమే కాకుండా, ఇంటి చుట్టూ కూడా అందంగా ఉంటుంది. అయితే ఈ మొక్కల్లో కూడా కొన్ని మొక్కలను నాటితే ఇంట్లో అశాంతి నెలకొంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఎలాంటి మొక్కలను ఇంట్లో పెంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటి ఆవరణలో మర్రి చెట్టును అస్సలు నాటకూడదట. ఎందుకంటే మర్రిచెట్టు ద‌రిద్రానికి సంకేతంగా చెబుతుంటారు. దాని ఊడలు ఇంటిని నాశనం చేస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. చాలామంది రావి చెట్టును పూజిస్తూ ఉంటారు. ఇది ఆక్సిజన్ కు ఉత్తమ వనరుగా చెప్పబడింది. కానీ మీరు మీ ఇంటి ఆవరణలో ఈ చెట్టు నాటితే వినాశనమేనట. ఒకవేళ ఇంటి ఆవరణలో ఈ చెట్టు ఉంటే దాని చుట్టూ గోడ కట్టి ప్రతిరోజు దీపం వెలిగిస్తే దరిద్రం దరిదాపుల్లోకి రాదని వాస్తు నిపుణులు అంటున్నారు.

do not plant these in your home they bring bad luck

ముఖ్యంగా ఇంటి దగ్గర ఖర్జూర చెట్టును అస్సలు నాటకూడదట. దీనివల్ల ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇంటి పరిసరాల్లో కానీ ఇంటి తోటలో కానీ రేగు చెట్టుని ఎప్పుడు నాటకూడదట. ఇది అశుభానికి సంకేతం. ఇది ఇంటి పరిసరాల్లో నాటడం వల్ల ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని వారు అంటున్నారు.

Admin

Recent Posts