వినోదం

కమల్ హాసన్ తో ప్రేమలో పడ్డ 8 హీరోయిన్స్ లిస్ట్ ఇదేనా ?

చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం కొంతమంది సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే కొంతమంది సీనియర్ హీరోలు కూడా తను భార్యలకు విడాకులు ఇచ్చారు. అలాంటి వారిలో విశ్వ నటుడు కమల్ హాసన్ కూడా ఒకరు. కమల్ హాసన్ మొదటసారిగా ఠాకూర్ ను వివాహం చేసుకున్నారు. వారికి శృతిహాసన్, అక్షర హాసన్ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కమల్, సారికలు 1988లో వివాహం చేసుకున్నారు. అయితే, తన సినిమాలతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న కమల్ వ్యక్తిగత, వైవాహిక జీవితాల విషయంలో మాత్రం ఎప్పుడూ వివాదాలు, మైనస్ ల తోనే ఉండేవాడు. కమల్ ప్రేమించిన వారి లిస్ట్ చాలా పెద్దగా ఉంది.

క‌మల్ కు గౌతమీతో అధికారికంగా పెళ్లి జరగకపోయినా, ఆ సహజీవనం కూడా కలిపి చూస్తే ముగ్గురు భార్యలు ఉన్నట్టే లెక్క. అసలు కమల్ ఎఫైర్లు పెట్టుకున్న‌ హీరోయిన్ల లిస్టు ఓసారి చూస్తే ఆసక్తికర విషయాలు కనిపిస్తాయి. కమల్ ముందుగా 1978లో వాణి గణపతిని పెళ్లి చేసుకున్నాడు. పదేళ్లపాటు ఆమెతో కాపురం చేశాక, 1988 లో విడాకులు ఇచ్చేశాడు. ఆమెకు విడాకులు ఇవ్వకముందే అప్పట్లో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న సారికతో డేటింగ్ చేయడం, ఆమెకు ప్రెగ్నెన్సీ రావడం జరిగిపోయాయి.

kamal haasan reportedly has relationships with these actress

ఆ బిడ్డే శృతిహాసన్. సారికతో చాలా రోజులు ఉన్నాక ఆమెకు విడాకులు ఇచ్చేసి గౌతమీతో 14 ఏళ్ల పాటు సహజీవనం చేశాడు. అసలు గౌతమి, కమల్ ఎప్పుడో ప్రేమించుకున్నారు. సారిక కంటే కమల్, గౌతమినే పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాడట. చివరకు అటూ ఇటూ తిరిగి గౌతమికి మరో వ్యక్తితో పెళ్లి జరగడం, విడాకులు తీసుకొని మళ్ళీ కమల్ తో పాత ప్రేమ చిగురించి సహజీవనం చేయడం, మళ్ళీ ఇద్దరి మధ్య అనుమానాలు పెరిగి వెళ్లిపోవడం జరిగింది. అయితే కమల్ విషయంలో ఈ మూడు అందరికీ తెలిసిన విషయాలు. మరో ముగ్గురు హీరోయిన్లతోను కమల్ ఎఫైర్ నడిపాడని అంటారు. ఇవి చాలామందికి తెలియదు. ఒక అప్పటి నటి శ్రీవిద్య, కమల్ ను పిచ్చిగా ప్రేమించింది.

శ్రీవిద్య కమల్ ను ఆరాధించింది. సర్వస్వం అర్పించేసింది. చివరకు పెళ్లి చేసుకోమని అడిగితే మనిద్దరం స్నేహితులం, అంతకుమించి ఏం లేదని చెప్పి తప్పించుకున్నాడ‌ట‌. కమల్ ఇచ్చిన షాక్ తో శ్రీ విద్య చాలా రోజులపాటు డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని అంటారు. ఆ తర్వాత రెండవ దశకంలో సిమ్రాన్ తోను కమల్ చాలా క్లోజ్ గా ఉండేవాడని, ఆమెతోనూ ప్రేమాయణం నడిపాడని కోలీవుడ్ మీడియా కోడై కూసింది. అంటే సారిక ను వదిలించుకునే చివర్లో సిమ్రాన్ తో వ్యవహారాలు నడిపాడని అంటారు. ఇక గౌతమితో బ్రేకప్ టైం లో తనతో రెండు సినిమాల్లో చేసిన అమెరికా అమ్మాయి పూజా కుమార్ తోనూ ఏదేదో రిలేషన్ ఉందని అంటారు.

Admin

Recent Posts