చిట్కాలు

5 నిమిషాల్లోనే మీ జుట్టును స‌హ‌జ‌సిద్ధంగా న‌ల్ల‌గా మార్చుకునే చిట్కా.. దీన్ని ఫాలో అయిపొండి చాలు..

వయసు పెరిగే కొద్ది మనలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. వయసు పెరిగే కొద్ది చర్మం ముడతలు పడిపోవడం, జుట్టు తెల్లగా మారిపోవడం ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. ఈరోజుల్లో చిన్న‌ వయసులోనే జుట్టు తెల్లగా అయిపోతోంది. చాలా మంది రకరకాల రంగుల్ని వాడుతున్నారు. జుట్టుని నల్లగా మార్చుకోవడానికి వివిధ పద్ధతుల్ని పాటిస్తున్నారు. అయితే ఐదు నిమిషాల్లో తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం… జుట్టు తెల్లగా అయిపోతుంటే చాలామంది కంగారుపడి రకరకాల టిప్స్ ని ఫాలో అవుతున్నారు రంగులు వంటి వాటిని ఉపయోగించడం వలన సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతూ ఉంటాయి.

అలా కాకుండా ఇంట్లో సహజసిద్ధంగా దీన్ని తయారు చేసుకుని జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు దీన్ని మీరు తయారు చేసుకొని 15 రోజులు పాటు ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచుకోవచ్చు చక్కటి ఫలితం కనబడుతుంది. జుట్టు నల్లగా అవ్వడమే కాకుండా ఒత్తుగా ఎదుగుతుంది జుట్టు రాలిపోదు కూడా. దీనికోసం ముందు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో గ్లాసు నీళ్లు పోసి టీ పొడి, బిర్యానీ ఆకులు, ఒక వెల్లుల్లిపాయ వేసి బాగా మరిగించండి.

make your white hair into black with this simple home remedy

ఐదు నిమిషాల నుండి ఏడు నిమిషాల పాటు మరిగించి తర్వాత ఈ మిశ్రమాన్ని వడకట్టేయండి ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించాలి. తలస్నానం చేసి ఆరిన జుట్టుకు మాత్రమే ఈ నీటిని పట్టించండి అరగంట అయ్యాక నీళ్లతో కడిగేయండి. తలకి ఇప్పుడు షాంపూ పెట్టకండి. మరుసటి రోజు తలకు షాంపూ పెట్టొచ్చు. ఇలా ఈ విధంగా మీరు చేస్తూ ఉంటే జుట్టు నల్లగా మారిపోతుంది చుండ్రు కూడా పోతుంది జుట్టు రాలడం వంటి ఇబ్బందులు కూడా ఉండవు జుట్టు బాగా ఎదుగుతుంది.

Admin

Recent Posts