వినోదం

ఇన్ని రోజులు ఉదయకిరణ్ విషయంలో తప్పు చిరంజీవిది అనుకున్నారు ? అసలు వాస్తవం ఏంటంటే ?

ఆనాటి లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ అందరికీ గుర్తుండే ఉంటాడు. సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి కెరీర్ స్టార్టింగ్ లోనే సూపర్ డూపర్ హిట్ చిత్రాలను అందుకొని స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఆ స్టార్ డమ్ చూసి దర్శకులు, అగ్ర నిర్మాతలు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. అతికొద్ది కాలంలోనే టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. ఆయన మరణానికి సంబంధించి ఇప్పటికీ ఎవరికి తోచిన విధంగా వారు చెబుతుంటారు. సోషల్ మీడియాలో సైతం ఎవరికి నచ్చినట్టు వారు రాస్తూనే ఉన్నారు. ఎవరు ఎన్ని కారణాలు చెప్పినప్పటికీ వాస్తవం ఏంటనేది మాత్రం ఉదయ్ కిరణ్ కి మాత్రమే తెలుసు.

ఉదయ్ కిరణ్ తో పనిచేసిన తోటి నటీనటులు, దర్శకులు కూడా తమకు తెలిసిన విషయాలను మీడియాతో పంచుకుంటున్నారు. ఓ ఇంటర్వ్యూలో మురళీమోహన్ ఉదయ్ కిరణ్ కి సంబంధించిన ఒక విషయాన్ని చెప్పుకొచ్చారు. మురళీమోహన్ ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడుతూ.. ఉదయ్ కిరణ్ కు చిరంజీవికి మధ్య ఉన్న రిలేషన్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఉదయ్ కిరణ్ కి హైపర్ టెన్షన్ ఎక్కువ. ఒక్కోసారి విపరీతమైన బిపి వస్తుంది. ఆ సమయంలో ఆయన తన కంట్రోల్ లో ఉండరు. ఆ సమయంలో సిచువేషన్ కూడా బ్యాలెన్స్ చేయలేకపోయారు. ఇలా బాధపడుతున్న ఉదయ్ కిరణ్ ని మేము ఆసుపత్రికి తీసుకువెళ్లి చూపించాము. అక్కడ డాక్టర్ మీరు ఇలా ఆవేశపడకూడదు.. ప్రశాంతంగా ఉండాలని ఉదయ్ కిరణ్ కి ఎన్నోసార్లు చెప్పారు.

murali mohan told about what really happened with uday kiran

డాక్టర్ తో సరే అని చెప్పిన ఉదయ్ కిరణ్ యధావిధిగా హైపర్ టెన్షన్ తో బాధపడేవారు. ఇక ఇండస్ట్రీలో ఎవరైనా ఒక సినిమాలో నటించి హిట్ కొడితే వారికి ఫోన్ చేసి అభినందించడం చిరంజీవి లక్షణం. ఈ క్రమంలోనే ఉదయ్ కిరణ్ మంచి సినిమాలు చేయడంతో తరచూ ఆయనని అభినందించడమే కాకుండా తన ఇంటి అల్లుడిగా చేసుకోవాలని కూడా భావించారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఉదయ్ కిరణ్ సినిమాలలో కూడా ప్లాప్ అయ్యారు. చివరికి అవకాశాలు లేకపోవడంతో అతను కూడా డిస్టర్బ్ కావడం వల్లే అలా ఆత్మ‌హ‌త్య చేసుకున్నారేమో అంటూ మురళీమోహన్ తెలిపారు. దీంతో మురళీమోహన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

Admin

Recent Posts