Off Beat

రైళ్ల పట్టాల మధ్య కంకర రాళ్లు ఎందుకు ఉంటాయి ?

<p style&equals;"text-align&colon; justify&semi;">మనలో చాలామంది రైలు ప్రయాణం చేసే ఉంటారు&period; రైలు పట్టాలను చూసినప్పుడు గానీ&comma; ప్రయాణం చేయడానికి వెళ్ళినప్పుడు గాని రైలు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తాం తప్ప ఇతర విషయాలను గమనించి ఉండరు&period; అలాగే మనం రైల్వే గురించి కొన్ని విషయాలను పెద్దగా పట్టించుకోము&period; రైలు పట్టాలను మీరు ఎప్పుడైనా గమనించారా&period;&period;&quest; పట్టాల మధ్య&comma; చుట్టుపక్కల కంకర రాళ్లు వేసి ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా కంకర రాళ్లు ఎందుకు వేశారో అనే విషయం చాలామందికి తెలియదు&period; వాటి గురించి పెద్దగా పట్టించుకోము కూడా&period; అయితే ఆ కంకర రాళ్లను ఎందుకు వేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం&period;&period; రైలు పట్టాలను వేసేముందు ప్రత్యేక దిమ్మెలను భూమిపై పరిచి వాటిపై రైలు పట్టాలను అమర్చుతారు&period; ఆ తర్వాత పట్టాలకు ఇరువైపులా&comma; మధ్యలో కంకర రాళ్ళను వేస్తారు&period; అయితే ఈ కంకర రాళ్ల వల్ల పట్టాల కింద ఉండే దిమ్మెలు కదలకుండా దృఢంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87402 size-full" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;railway-track&period;jpg" alt&equals;"why stones are put in railway tracks " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనివల్ల రైలు వెళుతున్నప్పుడు ప్రమాదం ఉండదు&period; ఇంతేకాక వర్షం పడినప్పుడు కంకర రాళ్లు ఉండటం వల్ల నీరు భూమిలోకి ఇంకిపోతోంది&period; దీంతో రైలు రాకపోకలకు ఎలాంటి ఆటంకం ఏర్పడదు&period; అలాగే భూమిపై చిన్న చిన్న మొక్కలు&comma; లేదా ముళ్ళపొదలు పెరుగుతూ ఉండడం చూస్తాం&period; కానీ రైలు పట్టాల మధ్య కంకర ఉండడం వల్ల అలాంటి మొక్కలు&comma; ముళ్ళపొదలు లాంటివి ఏవీ పెరగవు&period; దీంతో రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఆటంకం ఏర్పడదు&period; అలాగే రైలు పట్టాల మీద వెళ్లేటప్పుడు వచ్చే శబ్దాన్ని తగ్గిస్తుంది&period; అందుకే రైలు పట్టాల చుట్టూ ప్రక్కల గాని&comma; మధ్యలో కానీ కంకర రాళ్లు వేస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts