వినోదం

అల్లు అర్జున్ కోసం రాజమౌళితో అల్లు అరవింద్ ఎందుకు గొడవపడ్డాడు ? ఆ సినిమా తెచ్చిన గొడవ ?

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శక ధీరుడుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట స్టూడెంట్ నెంబర్ 1 సినిమాకి దర్శకత్వం వహించిన రాజమౌళి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా మంచి గుర్తింపుని పొందారు. ఇక ఆ తర్వాత అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఒక్క సినిమా కూడా ప్లాప్ అవ్వని ఏకైక దర్శకుడు రాజమౌళి అని చెప్పవచ్చు. ఇక ఈయన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకోగా.. ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు పొందారు.

ఆయనతో ఒక్కసారైనా సినిమా చేయాలని చాలామంది ఆశపడుతూ ఉంటారు. అలాంటి వారిలో అల్లు అర్జున్ కూడా ఒకరు. వాస్తవానికి గతంలోనే బన్నీతో రాజమౌళి సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ – రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన మగధీర సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాతో రామ్ చరణ్ కి స్టార్ ఇమేజ్ వచ్చింది. అయితే ఈ సినిమా తర్వాత అల్లు అరవింద్ తో మరో సినిమా చేయలేదు జక్కన్న. ముఖ్యంగా రాజమౌళి మగధీర సినిమా చేయాలని అనుకున్నప్పుడు అల్లు అరవింద్ ఈ సినిమాను ఎలాగైనా తన కొడుకుతో చేయించాలని ప్లాన్ చేశారట. ఇదే విషయాన్ని ఆయన రాజమౌళిని కలిసి చెప్పారట.

why allu aravind upset with rajamouli for allu arjun cinema

బన్నీతో సినిమా చేస్తే సినిమాపై బజ్ వస్తుందని, రామ్ చరణ్ కొత్త హీరో అయినందువల్ల అంతగా ఆడదేమోనని అనుమానాలను వ్యక్తం చేశారు అరవింద్. కానీ రాజమౌళి మాత్రం తాను ఆల్రెడీ రామ్ చరణ్ కు కమిట్ అయ్యానని, అతనితోనే చేస్తానని చెప్పారట. దీంతో చేసేది లేక అల్లు అరవింద్ సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత ఆ సినిమాకు భారీ బడ్జెట్ పెట్టేందుకు అరవింద్ స్వయంగా ముందుకు వచ్చారు. ఆయన ఆశించినట్లే అనుకున్న దానికంటే భారీగా లాభాలు వచ్చి పడ్డాయి. ఇప్పుడు బన్నీకి పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. ఇదే సమయంలో రాజమౌళితో ఓ సినిమా పడితే బన్నీ రేంజ్ మరింత పెరిగిపోతుందని అల్లు అరవింద్ భావిస్తున్నారట. ఇదే విషయంపై రాజమౌళితో అల్లు అరవింద్ మరోసారి చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది.

Admin

Recent Posts