Categories: వినోదం

Sridevi : అరె.. అచ్చం శ్రీ‌దేవిలా ఉందే..! ఎవ‌రీమె.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఫొటోలు..!

Sridevi : ప్ర‌ముఖ న‌టి శ్రీ‌దేవి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అన్ని ఇండ‌స్ట్రీల ప్రేక్ష‌కుల‌కు ఆమె తెలుసు. ఎన్నో హిట్ చిత్రాల్లో న‌టించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ఎంతో మంది సీనియ‌ర్‌, జూనియ‌ర్ హీరోల స‌ర‌స‌న న‌టించి మెప్పించింది.

Sridevi lookalike dipali choudhary photos viral in social media

అయితే శ్రీ‌దేవి దుబాయ్‌లో జ‌రిగిన ఓ ఫ్యామిలీ ఫంక్ష‌న్‌లో అనుమానాస్ప‌ద స్థితిలో క‌న్ను మూసింది. ఫిబ్ర‌వ‌రి 24, 2018వ తేదీన దుబాయ్‌లో ఆమె మృతి చెందింది. దీంతో యావ‌త్ భార‌తీయ సినీ ప్రేక్ష‌కులు విషాదంలో మునిగిపోయారు. శ్రీ‌దేవి మ‌ర‌ణం ప‌ట్ల చిత్ర ప‌రిశ్ర‌మ దిగ్భ్రాంతి చెందింది. అయితే ప్ర‌స్తుతం అచ్చం శ్రీ‌దేవిలాగే ఉన్న ఓ మ‌హిళ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

దీపాలి చౌద‌రి అనే మ‌హిళ ప్ర‌స్తుతం ఇంట‌ర్నెట్ సెన్సేష‌న‌ల్‌గా మారింది. ఆమె ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్నాయి. కార‌ణం.. ఆమె అచ్చం శ్రీ‌దేవిలా ఉండ‌డ‌మే. అంతేకాదు, ఆమె శ్రీ‌దేవిలా గెట‌ప్ వేసుకుని శ్రీ‌దేవికి చెందిన ప‌లు సినిమాల్లోని సీన్ల‌ను మ‌ళ్లీ రీక్రియేట్ చేస్తోంది. అచ్చం శ్రీ‌దేవిలాగే న‌టిస్తోంది. దీంతో శ్రీ‌దేవిలా ఉన్న ఆమెను చూసి ప్రేక్ష‌కులు షాక‌వుతున్నారు. శ్రీ‌దేవి మ‌ళ్లీ వ‌చ్చిందా.. అన్న‌ట్లుగా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

దీపాలి చౌద‌రికి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. అందులోనే ఆమె త‌న ఫొటోల‌ను షేర్ చేస్తుంటుంది. ఆ అకౌంట్‌కు 30వేల‌కు పైగా ఫాలోవ‌ర్లు కూడా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె ఫొటోలు, వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Admin

Recent Posts