వినోదం

నటనలోనే కాదు డాన్సుల్లోనూ ఒక ఊపు ఊపేసిన 10 మంది స్టార్ హీరోయిన్స్

వెండితెరపై హీరోయిన్స్ కి ఎంత క్రేజ్ ఉంటుందో.. అదే స్థాయిలో బుల్లితెర హీరోయిన్స్ కి పాపులారిటీ ఉంటుంది. టెలివిజన్ చానల్లలో టీవీ సీరియల్స్ హవా ఎక్కువగా పెరిగిపోయింది. మన చిన్నతనం నుంచి ఇప్పటివరకు కూడా వాటి క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదంటే అతిశయోక్తి కాదు. సినిమా స్థాయిని తలదన్నేలా టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ వినోదాన్ని పంచడంలో సీరియల్స్ ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. ఇదంతా పక్కకు పెడితే, తమ డాన్స్ తో ఇండియన్ స్క్రీన్ ని షేర్ చేసిన 10 మంది హీరోయిన్స్ గురించి ఇవాళ తెలుసుకుందాం.

శ్రీ లీల, అందం మాత్రమే కాదు అద్భుతంగా డాన్స్ చేయగలదు. ఈమె డాన్స్ లో మంచి గ్రేస్ కూడా ఉంటుంది. ఆమె సినిమాలు చాలా వ‌ర‌కు హిట్ కావడానికి శ్రీ లీల ఎంతో కష్టపడుతుంది. తన అందంతో పాటు డ్యాన్స్ తో కూడా మంత్రముగ్ధుల్ని చేసేది బాలీవుడ్ హీరోయిన్ మాధురి దీక్షిత్‌. ఈమెను లిస్టులో నెంబర్ వన్ అనుకోవచ్చు. రంగీలా బ్యూటీ ఊర్మిళ డ్యాన్స్ తో అందరిని మత్తెక్కించగలదు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది అంటే ఈమె డ్యాన్స్ ప్రధాన కారణం అని చెప్పవచ్చు. సాధారణంగా ఐశ్వర్యం అంటే డబ్బు అనాలి. కానీ దానికి డెఫినిషన్ అందమని మార్చేసింది ఐశ్వ‌ర్యారాయ్‌. అందం మాత్రమే కాదు డాన్స్ తో కూడా ఈమె టాప్ లేపేసేది.

these actress became famous with their dance

అప్పట్లో మన మెగాస్టార్ చిరంజీవితో కలిసి రాధ‌ చేసే డ్యాన్స్ కు థియేటర్స్ లో జనాలు ఈలలు, కేకలతో ధూమ్ ధామ్ చేసేవారు. అంత బాగా డాన్స్ చేసేది. మన అతిలోక సుందరి శ్రీదేవి కూడా తన డ్యాన్స్ తో ఇండియన్ సినిమాని ఊపేసింది. ఎంత ఫేడౌట్ అయిపోయినా సరే స‌మీరా రెడ్డి డాన్స్ మాత్రం ఇరక్కొట్టేసేదండి. మిల్కీ బ్యూటీ కూడా డ్యాన్స్ సూపర్ గా చేస్తుంది. ఈమె అందానికి డ్యాన్స్ తోడైతే ఎలా ఉంటుందో చాలా సినిమాల్లో చూసాం. హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా శృతి హాస‌న్ డ్యాన్స్ చేయగలదు. ఈమె కూడా బెస్ట్ డాన్సర్ అని చెప్పొచ్చు. మన ఫిదా బ్యూటీ సాయి ప‌ల్ల‌వి డ్యాన్స్ గురించి చెప్పేదేముంది. ఈమె డ్యాన్స్ చేసే సాంగ్స్ అన్ని యూట్యూబ్‌ల‌లో బిలియన్ వ్యూస్ ను కొల్లగొడుతుంటే, హీరోలు కూడా ఈమెతో పోటీపడి డ్యాన్స్ చేయలేకపోతున్నారు.

Admin

Recent Posts