వినోదం

పవన్ కళ్యాణ్ సత్యాగ్రహి సినిమా ఆగిపోవడానికి అసలు కారణం ఇదే..!!

కొన్ని కొన్ని సార్లు సినిమాలు మధ్యలోనే అయిపోతాయి. ఒకవేళ షూటింగ్ పూర్తి చేసుకున్నా ప్రేక్షకుల ముందుకు వెళ్లడానికి సిద్ధమయ్యే సినిమాలు కూడా ఆగిపోతాయి. అన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పించాలన్న ఉద్దేశంతోనే ప్రారంభమవుతాయి కానీ పలు కారణాల వల్ల మధ్యలో ఆగిపోతాయి. దీనికి చాలా కారణాలే ఉండొచ్చు. దర్శక నిర్మాతలు ఎన్నో ప్లాన్ లు చేసి ఎన్నో కథలను తెరకెక్కించాలని అనుకుంటారు. కానీ నటీనటుల వ్యక్తిగత కారణాలవల్ల, లేదా మరే ఇతర సమస్యల వలన సినిమా అయిపోతుంది. అలా పవన్ కళ్యాణ్ సత్యాగ్రహి కూడా మధ్యలో ఆగిపోవడానికి వెనుక కూడా ఓ కథ ఉంది.

కొన్ని సంవత్సరాల క్రితం నిర్మాత ఏయం రత్నం పవన్ కళ్యాణ్ తో సత్యాగ్రహం అనే చిత్రాన్ని ప్రకటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం సారధ్యంలో ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించాల్సి ఉంది. అన్నపూర్ణ స్టూడియోలో భారీగా ఓపెనింగ్ కూడా చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమాను పక్కన పెట్టేశారు. అయితే ఈ సినిమా ఎందుకు ఆగిపోయిందో ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఈ సినిమా చేసి ఉంటే చాలా గొప్ప సినిమా అయ్యేదని అభిమానులు అంటూ ఉంటారు. అయితే నిర్మాతతో క్రియేటివ్ డిఫరెన్స్ లు వచ్చాయని, స్క్రిప్టు సరిగా లేదని, బడ్జెట్ ఎక్కువైందని ఇలా ఎవరికి తోచిన విధంగా వారి వర్షన్ చెబుతూ ఉంటారు. ఈ విషయమై నిర్మాత ఏఎం రత్నం మాట్లాడారు.

this is the reason why pawan kalyan satyagrahi movie stopped

లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయన్ చేసిన ఎమర్జెన్సీ మూమెంట్ ఆధారంగా తెరకెక్కాల్సిన ఈ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ నుండి పవన్ కళ్యాణ్ తప్పుకున్నారు. ఆయన ఎందుకు తప్పుకున్నారన్న విషయం గురించి ఏఎం రత్నం మాట్లాడుతూ.. జానీ చిత్రం రిజల్ట్ చూశాక పవన్ కళ్యాణ్ చాలా నిరాశపడ్డారు. ఆయన డైరెక్షన్ స్కిల్స్ తెలుగు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేదని భావించారు. దాంతో సత్యాగ్రహి చిత్రం పై మా డబ్బుని రిస్క్ చేయడానికి ఇష్టపడలేదు. అందువలన ఆ సినిమా ప్రాజెక్టుని ఆయనే ఆపేశారు అని ఏఎం రత్నం అన్నారు. అలా ఈ సినిమా ఆగిపోయిన 18 ఏళ్ల తర్వాత సత్యాగ్రహి గురించి మళ్ళీ గుర్తు చేసుకున్నారు.

Admin

Recent Posts