వినోదం

జేడీ చ‌క్ర‌వ‌ర్తికి తెలుగులో ఎందుకు అవ‌కాశాలు రావ‌డం లేదు..?

1989 లో ఒక 17 ఏళ్ళ కుర్రాడు శివ‌ అనే సినిమాలో తన తెలుగు సినిమా కెరీర్ మొదలు పెట్టాడు. మొదటి సినిమానే పెద్ద హిట్ అవ్వడం చాలా అదృష్టం. అదే సినిమా హిందీ రిమేక్ లో కూడా ఆయనను మళ్ళీ తీసుకున్నారు.20 ఏళ్ళకే తెలుగు, తమిళం, మలయాళం, హిందీ లో సినిమాలు చేయడం చాలా గొప్ప విషయం. నేను నాగార్జున గురించి చెబుతున్నాను అని అనుకుంటున్నారా? కాదండీ ఆయన వేరెవరో కాదు జే డీ చక్రవర్తి నే. చాలా మంది నటులు కేవలం రొమాంటిక్ లేదా యాక్షన్ సినిమాలు మాత్రమే చేస్తారు కానీ ఈయన అలా కాదు. తన సినిమా కెరీర్ లో లవ్ స్టొరీ, యాక్షన్, థ్రిల్లర్, హారర్, గెంగ్స్టర్ ఇలా అని రకాల సినిమాలు నాలుగు భాషలలో చేసాడు. అందరికీ కొన్ని సంవత్సరాల తర్వాత హీరో పాత్రలు ఇవ్వడం మానేస్తారు. ఈయనకు ఆ కాలం తన జీవితంలో కొంత తొందరగానే వచ్చింది.

21వ శతాబ్దం నుండి ఈయనకు గొప్ప సినిమాలు రాలేదు. అన్ని భాషలలో చిన్న చిన్న పాత్రలు మాత్రమే వచ్చాయి. దుబాయ్ శ్రీను సినిమాలలో లాగా కేవలం 20 నిమిషాలు ఉండే పాత్రలు మాత్రమే లభించేవి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈయన ఇప్పటికి నటిస్తున్నాడు కానీ ఈయనకు తమిళం, మలయాళం సినిమాలలో ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. అప్పుడప్పుడు ఈయనను తమిళం, మలయాళం సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేయడం చూసి కొద్దిగా బాధగా అనిపిస్తుంది అలాగే కొంచెం ఆశ్చర్యం కూడా కలుగుతుంది సొంత తెలుగువారే ఈయనకు అవకాశాలు ఇవ్వట్లేదు అటువంటిది వేరే భాషలవారు ఎందుకు ఇస్తున్నారా అని. 2009 లో జోష్ అనే సినిమాలో ఈయనను విలన్ గా చూసాక ఈయన చాలా టాలెంటెడ్ అని అర్థమైంది . జగప‌తి బాబు లాగా అధ్బుతమైన విలన్ రోల్స్ చేస్తాడు అని అనుకున్నాను కానీ అసలు ఈయన గురించి అందరూ మర్చేపోయారు.

why jd chakravarthy not getting any movie offers

ఈయన సహాయ నటుడిగా కూడా అధ్బుతంగా నటించగలడు కానీ ఎందుకో తెలియదు తెలుగు సినిమావారు ఈయనకు ఎక్కువ అవకాశాలు ఇవ్వలేదు. ఎందరో నటులు వస్తుపోతు ఉంటారు కానీ నాలుగు భాషలలో నటించే, అన్ని రకాల సినిమాలు చేసే, డైరెక్షన్ కూడా చేసే, పాటలు కూడా పాడే జే డీ చక్రవర్తి వంటి వ్యక్తులు ఈ కాలంలో చాలా తక్కువ, అసలు లేరనే చెప్పవచ్చు. ఇంకొక్క ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈయన జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, వెంకటేష్, నాగార్జున కంటే చిన్నవాడు , వీళ్ళందరూ ఇప్పటికి మంచి మంచి సినిమాలు చేస్తున్నారు కానీ ఈయనను మాత్రం దాదాపు అందరూ మర్చిపోయారు. ఈ మధ్యనే కన్నడలో కూడా నటించి ముచ్చటగా ఐదు భాషలలో సినిమాలలో నటించే వ్యక్తిగా ఒక పేరు పొందాడు. ఈయన గురించి తల్చుకుంటే కొంచెం బాధ కలుగుతుంది. ఇది మన జే డీ చక్రవర్తి కథ.

Admin

Recent Posts