పాలు పొంగు వచ్చే వరకూ కాచి , గోరువెచ్చగా అయ్యేవరకు వేచి రెండు ముచ్చికలున్న / తొడిమలున్న ఎండుమిరపకాయలువేసి మూతపెట్టి వెచ్చటి ప్రదేశంలో గిన్నెని రాత్రంతా వుంచితే , తెల్లవారేసరికి గడ్డపెరుగు సిద్దం.
మేము సర్కారు ప్రాంతాలనుంచి ప్రయాణం చేసి వేసవి సెలవుల తరువాత అనంతపూరు, చిత్తూరు కరీంనగర్ లాంటి దూరప్రాంతాలకు వెళ్ళినప్పుడు పక్కఇళ్ళలో తోడుకి పెరుగు లభించేదికాదు ఆ రోజుల్లో , అమ్మ అలాగే ఎండు మిరపకాయలతోనే మొదటి పెరుగు చేసేది!
ఇక్కడ మాకు పెరుగుతోడు ఇవ్వగల ఇరుగుపొరుగు వుండరు,పైగా ఈచలి కాలంలో పెరుగు గడ్డలా తోడుబెట్టడం కూడా కష్టమే , అందుకే జాగ్రత్తగావుంటాము తోడంటు విషయంలో, కానీ పొరపాటు జరగవచ్చుకదా ? అందుకే పై వివరణ. పచ్చిమిరపకాయలు ,చింతపండు తేలిక , బాదం పప్పు మునుపే పెరుగులోనానవేసినవి , ఇలా ఎన్నోవుపాయాలున్నా ఇది అమ్మ చేసిన సులువైన పద్దతి! చిట్కా అంటేనే అవసరానికి పనిచేసేది..