హెల్త్ టిప్స్

షుగ‌ర్ ఉన్న‌వారు ఏయే ఆహారాల‌ను తినాలి.. వేటిని తిన‌కూడదు..!

డయాబెటిక్ రోగులకు ఏ రెండు భోజనాలకు మధ్య వ్యవధి అధికంగా వుండరాదు. వ్యవధి అధికంగా వుంటే రక్తంలో గ్లూకోజ్ స్ధాయి పడిపోతుంది. భోజనం తీసుకున్న వెంటనే బాగా పెరిగిపోతుంది. కనుక వారు తినే ఆహారాన్ని మూడు సార్లుగా అంటే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమయాలలో తీసుకుంటూ ఉదయం 11 గం.లకు సాయంత్రం 5 గం.లకు లైట్ గా స్నాక్స్ వంటివి తీసుకోవాలి. ఇతరులవలెనే, డయాబెటిక్ రోగులకు కూడా అన్ని రకాల ఆహారాలు కావాలి. అయితే, వీరు త్వరగా జీర్ణం అయ్యే కార్బో హైడ్రేట్స్ తీసుకోరాదు. దీనివలన బ్లడ్ షుగర్ స్ధాయి పెరుగుతుంది.

షుగర్, స్వీట్లు, అరటిపండు, పండ్ల రసాలు,చాక్లెట్లు, ద్రాక్ష, కూల్ డ్రింక్, అన్నం వంటివి తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ఇతర ఆహారాలు అంటే గోధుమ, కార్న్, వెజిటబుల్స్, పండ్లు వంటివి కార్బోహైడ్రేట్లు వున్నప్పటికి తీసుకోవచ్చు. డయాబెటిక్ రోగులకు ప్రొటీన్లు అత్యవసరం. గింజధాన్యాలు, బీన్స్, ఆకు కూరలు, కూరగాయలు, పాలు, పెరుగు, సోయా, పనీర్, క్రీమ్ లలో ప్రొటీన్లు వుంటాయి. మాంసాహారులైతే, బీఫ్, ఫోర్క్, లివర్, కిడ్నీ, తినవచ్చు. ఎండుఫలాలైన బాదం, మొదలైనవి తినవచ్చు వీటిలోని కొవ్వు మంచిదే. అయితే నూనెలు, మేక మాంసం వదిలివేయాలి. ఒకే రకమైన నూనె ఎల్లపుడూ వాడకుండా, వేరుశనగ, సోయా, వంటివి మార్చాలి.

diabetic patients food which one to take and which one not

పచ్చళ్ళు, కొబ్బరి, మసాలా ఆహారాలు తినరాదు. ప్రతిరోజూ ఆహారంలో విటమిన్లు, మినరల్స్ వుండే ఆకు కూరలు, సలాడ్లు వంటివి చేర్చండి. పీచు అధికంగా వుంటే రక్తంలో కొల్లెస్టరాల్ నియంత్రించబడుతుంది. పీచు అధికంగా వుండే కూరలు, జొన్నలు మొదలైనవి తినండి. అయితే తక్కువ కేలరీలు వున్న ఆహారాలు ఎంచుకోవాలి. నల్లని ద్రాక్ష మంచిది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. ఇవి రోగ నిరోధకతను పెంచుతాయి. వ్యాయామం అశ్రధ్ధ చేయరాదు. ప్రతిరోజూ అరగంట నుండి గంట వరకు నడక లేదా వ్యాయామం తప్పనిసరిగా ఆచరించాలి.

Admin

Recent Posts