బీర్, వైన్, విస్కీ, బ్రాందీ వంటి ఆల్కహాల్ డ్రింక్స్… కూల్‌డ్రింక్… ఫ్రూట్ జ్యూసులు… ఇలా మనకు ఎన్నో రకాల డ్రింక్స్ ఉన్నాయి తాగేందుకు. ఎవరైనా తమ ఇష్టాలు, అభిరుచులకు అనుగుణంగా ఆయా డ్రింక్స్‌ను తాగుతారు. అయితే వీటిని ఇంట్లో తాగేవారైతే ఏదో ఒక గ్లాస్‌లో పోసుకుని తాగుతుంటారు. కానీ అలా కాదు తెలుసా. ఒక్కో రకమైన డ్రింక్‌కు ఒక్కో రకమైన గ్లాస్ ఉంటుంది. వాటిల్లోనే తాగాలి. అలా తాగితేనే ఆ డ్రింక్ తాగిన నిజమైన అనుభూతి కలుగుతుందట. మరి… ఏ తరహా డ్రింక్‌లను ఎలాంటి గ్లాస్‌లలో తాగాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
రాక్ గ్లాస్‌లు.. ఈ గ్లాస్‌లలో విస్కీ, బ్రాందీ, రమ్, వోడ్కా వంటి డ్రింక్స్ తాగాలి. ఈ గ్లాస్‌లలో ఐస్ వేసుకునేందుకు చాలా సులభంగా ఉంటుంది. స్ట్రాంగ్‌గా పట్టుకోవచ్చు. ముందు చెప్పిన డ్రింక్స్ తాగేందుకు ఈ తరహా గ్లాస్‌లు పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతాయి. కోల్లిన్స్ గ్లాస్‌లు.. ఫ్రూట్ జ్యూస్‌లు, కాక్ టెయిల్ డ్రింక్స్ తాగేందుకు ఈ గ్లాస్‌లు బాగా పనికొస్తాయి. వీటి ద్వారా ఆయా డ్రింక్స్‌ను సులభంగా సిప్ చేయవచ్చు. అవసరం అనుకుంటే స్ట్రాలను ఉపయోగించుకోవచ్చు. ఫ్లూట్ గ్లాస్‌లు.. షాంపేన్, వైన్, సోడా వంటి డ్రింక్స్‌ను ఈ గ్లాస్‌లలో తాగుతారు. వాటిని ఈ గ్లాస్‌లో తాగితేనే పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. సోడా వంటి డ్రింక్స్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ గ్లాస్‌లను తయారు చేశారు. మార్టిని గ్లాసెస్.. ఐస్ లేకుండా చిన్నపాటి డ్రింక్‌ను ఒకే సిప్‌లో తాగేందుకు ఇలాంటి గ్లాస్‌లను వాడుతారు. సాధారణంగా వీటిని వోడ్కా, వైన్ వంటి డ్రింక్స్ తాగేందుకు ఉపయోగిస్తారు.
హై బాల్ గ్లాసెస్.. ఐస్ ఎక్కువగా వాడుతూ తయారు చేసే డ్రింక్స్‌ను తాగేందుకు ఈ గ్లాస్‌లను వాడుతారు. కాక్ టెయిల్స్, మిల్క్ షేక్స్, ఫ్రూట్ జ్యూస్‌లను ఈ గ్లాస్‌లతో తాగుతారు. వాటికి ఈ గ్లాస్‌లు పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతాయి. వైన్ గ్లాస్‌లు.. పేరులోనే ఉంది కదా. అవును, ఈ గ్లాస్‌లను ప్రత్యేకంగా వైన్ తాగేందుకే వాడుతారు. వైన్‌కు అయితేనే ఈ గ్లాస్‌లు సెట్ అవుతాయి. బీర్ గ్లాస్‌లు.. వీటిల్లో రెండు రకాలు ఉంటాయి. నిలువైన పొడవుగా ఉన్న గ్లాస్‌లు ఒక టైప్ అయితే, జగ్గు లాంటి గ్లాస్‌లు రెండో టైప్. రెండింట్లో దేంతో అయినా బీర్‌లను తాగవచ్చు. వాటికి ఈ గ్లాస్‌లు సరిగ్గా సరిపోతాయి.