హెల్త్ టిప్స్

శ‌రీరంలో క‌ఫం అధికంగా ఉందా.. ఈ నీళ్ల‌ను తాగితే దెబ్బ‌కు పోతుంది..

ప్రతిరోజూ పరగడుపున లేదంటే ఏదైనా తినడానికి ఒక అరగంట ముందు మెంతులు నానబెట్టిన నీళ్లు ఒక గ్లాసు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. కఫం ఎక్కువగా ఉన్న వారికి ఇది మంచి ఔషదం. కఫంతో బాధపడుతున్న వారిలో అగ్ని తక్కువగా ఉంటుంది. రోజూ మెంతి నీళ్లు తాగడం వల్ల శరీరంలో అగ్ని పుడుతుంది. ఫలితంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. పాలిచ్చే తల్లులు ఈ నీటిని తాగడం వల్ల పాలు సమృద్ధిగా పడతాయి.

రక్తంలో షుగర్ స్థాయిలను మెంతులు నియంత్రిస్తాయి. డయాబెటిస్ ఉన్న వారు మెంతులను డైట్ ప్లాన్ లో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మెంతులు నానబెట్టిన నీళ్లు తాగడం వల్ల జీవక్రియల రేటు పెరుగుతుంది. బరువు తగ్గుతారు.

drink fenugreek seeds water ti reduce mucus

మెంతి నీరు యాంటాసిడ్ గా పనిచేస్తుంది. రోజూ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రైటిస్ వంటి సమస్యలు దూరమవుతాయి.

Admin

Recent Posts