హెల్త్ టిప్స్

ప‌డుకున్న వెంట‌నే గాఢంగా నిద్ర ప‌ట్టాలంటే.. ఇలా చేయండి..!

రాత్రివేళ తగినంత సమయం గాఢ నిద్ర పోతేనే శరీరం, మెదడు… రెండూ ఉదయానికి యాక్టివ్‌ అవుతాయి. మరి గాఢనిద్ర పట్టాలంటే ఏం చేయాలి? ఇదిగో నిపుణులు చెబుతున్న సూచనలివి. గాఢ నిద్ర పట్టాలంటే ఏం చేయాలి? నిపుణులు ఏం చెబుతున్నారంటే.. పడుకోవడానికి రెండు గంటల ముందే భోజనాన్ని చేసేయాలి. ఆహారం జీర్ణం కావడానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. కాబట్టి భోజనానికి, నిద్రకు ఆ గ్యాప్‌ ఉండేలా చూసుకోవాలి. ఆహారం జీర్ణమయ్యాక బెడ్‌పైకి చేరితే మంచి నిద్ర పడుతుంది.

పడుకునే ముందు స్నానం చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించి మంచి నిద్ర పట్టేందుకు సహాయపడుతుంది. అయితే వేడి నీళ్ల స్నానం చేయకూడదు. స్నానం వల్ల శరీరం శుభ్రం కావడమే కాదు, ఒత్తిడి, అలసట కూడా దూరమవుతాయి.

how to get good night sleep follow these tips

నిద్రకు ఉపక్రమించే ముందు కాసేపు ధ్యానం చేయడం అలవాటు చేసుకుంటే గాఢనిద్ర మీ సొంతమవుతుంది. కొద్దిరోజుల్లోనే ఆ మార్పు మీలో స్పష్టంగా కనిపిస్తుంది. బెడ్‌రూమ్‌లో ఉష్ణోగ్రత సాధారణ స్థాయి కన్నా కొద్దిగా తక్కువ ఉండేలా చూసుకోవాలి. శరీరానికి హాయినిచ్చేలా ఉండాలి. మంచి నిద్రకు ఇది అవసరం. బెడ్‌పైకి చేరిన తరువాత ఫోన్‌ ఎట్టిపరిస్థితుల్లోనూ చూడకూడదు. గ్యాడ్జెట్స్‌ వల్ల నిద్ర దూరమవుతుంది. కాబట్టి సైలెండ్‌ మోడ్‌లో పెట్టేసి నిద్రకు ఉపక్రమించాలి. గాఢ నిద్ర పోవాలంటే ఏదైనా మంచి పుస్తకం చదవాలి. పుస్తకం తీసి చదవడం ప్రారంభించగానే ఆటోమెటిగ్గా నిద్ర ముంచుకొస్తుంది.

Admin

Recent Posts