వైద్య విజ్ఞానం

మీరు కోపంగా ఉన్న‌ప్పుడు మీ గుండె ఎలా ప్ర‌వ‌ర్తిస్తుందో తెలుసా..?

గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ఒక రోజుకి 7000 లీటర్లు ర‌క్తాన్ని పంప్ చేస్తుంది. మా ఇంటి నీళ్ళ ట్యాంకు 1000 లీటర్లు. అలాంటి 7 ట్యాంకుల రక్తాన్ని గుండె ఒక్క రోజులో పంప్ చేస్తుంది. ఇందులో 70% మెదడుకి వెళుతుంది. 30% మిగతా శరీర అవయవాలకు వెళుతుంది. గుండె ఒకసారి కొట్టుకోటానికి 0.8 సెకన్ల సమయం పడుతుంది. ఈ 0.8 సెకన్ల సమయంలో 0.3 సెకన్ల సమయం సంకోచించటానికి (contraction), 0.5 సెకన్ల సమయం వ్యాకోచించటానికి (అంటే రిలాక్స్ కావటానికి) ప‌డుతుంది. ఈ 0.5 సెకన్ల రిలాక్స్ టైమ్ లో రక్తం ఊపిరి తిత్తులకు వెళ్లి ఆక్సిజన్ గ్రహిస్తుంది. ఈ రిలాక్స్ టైమ్ తగ్గితే రక్తం సరిగా శుభ్రపడదు.

మీరు టెన్షన్ లో గానీ కోపంతో గానీ ఉంటే ఏమవుతుంది? మీ మెదడుకి ఎక్కువ రక్తం అవసరమవుతుంది. అప్పుడు గుండె తక్కువ రిలాక్స్ అవుతుంది. 0.5 బదులు 0.4 సెకన్ల టైమ్ రిలాక్స్ అవుతుంది. గుండె ఒక బీట్ కి 0.8 కి బదులు 0.3 + 0.4 = 0.7 టైమ్ మాత్రమే తీసుకుంటుంది. నిమిషానికి 84 సార్లు కొట్టుకుంటుంది. గుండెకి విశ్రాంతి (రిలాక్సేషన్) 20% తగ్గుతుంది. రక్తం 80% మాత్రమే శుభ్రపడుతుంది.

 how your heart behaves when you are in anger and tension

ఈ అపరిశుభ్రమైన రక్తం మీ మెదడుని మీ శరీర అవయవాలని సరిగా శుభ్రపరచలేకపోతుంది. కనుక కోపపడవద్దు, టెన్షన్ పడవద్దు. ఇతరులమీద కోపం, ద్వేషం బదులు మీరు ప్రేమ చూపిస్తే మీ గుండె 72 సార్లు కొట్టుకుని మీ మెదడు ప్రశాంతంగా చురుకుగా ఉంటుంది. గుండె నెమ్మదిగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది.

Admin

Recent Posts