హెల్త్ టిప్స్

పొట్ట త‌గ్గించాల‌ని చూస్తున్నారా..? అయితే ఇలా చేయ‌డం త‌ప్పనిస‌రి..!

పొట్ట తగ్గించడం ఎలా? నీళ్ళు, బీరు, డ్రింకులు ఎన్నో తాగటం, పొట్ట ఉబ్బించుకోవడం. లేట్ నైట్ లో తినటం, వెంటనే పడుకోవడం, పొట్టకు కొవ్వు చేర్చుకోవడం. శరీరాకృతి పాడు చేసుకోవడంగా వుంది. మరి పొట్ట తగ్గాలంటే కొన్ని చిట్కాలు పరిశీలించండి. పొట్ట వ్యాయామాలు చేస్తే పొట్ట తగ్గుతుందా? సిక్స్ ప్యాక్ పొట్ట కావాలంటే పొట్ట కండరాలు బలపరచాలి. శరీర కొవ్వు తగ్గించాలి. వీపు ధృఢత్వం పొందాలి. శరీరం పై భాగం, కింది భాగం రెండూ గట్టిపడాలి.

ఆరోగ్యకరంగా బరువు తగ్గాలంటే మరో మార్గం లేదు. వీపు పిరుదులు గట్టిపడకుండా పొట్ట ఒకటే బలపరిస్తే శారీరక అసమతుల్యత ఏర్పడుతుంది. కనుక పొట్ట కండరాలకుగాను శరీరం మొత్తానికి వ్యాయామాలు కావలసిందే. అన్నిటికి మించి పొట్టకు మనం ఏ రకమైన ఆహారాలు అందిస్తున్నామనేది కూడా కాస్త గమనించాలి. శరీరానికి అవసరమైన ఆహారాలు అంటే కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్, ఎంజైమ్స్, పీచు పదార్ధాలు వంటివి సమపాళ్ళలో ఇస్తూ, వ్యాయామాలు చేయాలి.

if you want to reduce belly fat you must do these

రాత్రులందు తిన్నవెంటనే నిద్రించకండి. నిద్రకు మీ డిన్నర్ కు మధ్య కనీసం రెండునుండి మూడు గంటల వ్యవధి వుండేలా చూడండి. ప్రత్యేకించి, పొట్ట కండరాలకవసరమైన వ్యాయామాలు అధికంగా చేయండి. వెల్లకిలాపరుండి మోకాళ్ళను ఛాతీవరకు ఆనించే వ్యాయామం ప్రతిరోజూ పది నుండి పదిహేను నిమిషాలపాటు చేస్తే చాలు. మీ పొట్టను మీరు నియంత్రించుకోవచ్చు.

Admin

Recent Posts