హెల్త్ టిప్స్

స్త్రీలు, పురుషులు పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు క‌ర‌గాలంటే.. వీటిని తినాలి..!

మహిళ సహజ శారీరక రూపం నడుము వద్ద సన్నగా ఒంపుతో వుండి, పిరుదులవద్ద కొద్దిపాటి లావుగా వుండటం. అయితే, నేటి మహిళలు చాలా భాగం తమ శారీరక రూపాన్ని పై నుండి కిందకు ఒకే లావు కలిగి వుంటున్నారు. దురదృష్టవశాత్తూ పొట్టలో కొవ్వు పెరిగిపోతోంది. నడుము వుండవలసిన దానికంటే కూడా అధిక సైజు చూపుతోంది. పొడుచుకుని ముందుకు వచ్చే పొట్ట మగవారికి సైతం సాధారణమైపోయింది. పురుషులు, స్త్రీలు కొన్ని సమయాలలో సన్నగా వున్నప్పటికి నడుము మాత్రం లావుగానే ఎందుకుంటోంది? దీనికిగాను వారు చేయాల్సిందేమిటి? నడుము భాగం అధింకంగా వుంటే చూపులకు అసహ్యంగా వుండటమే కాదు. అనారోగ్యం కూడాను.

పురుషులకు 40 అంగుళాలపైనా, మహిళలకు 35 అంగుళాలపైనా నడుం కొలత వుంటే అది అధికబరువు సమస్య. జీవప్రక్రియ సరిలేనట్లే. ఈ సరిలేని జీవప్రక్రియ ఇన్సులిన్ పై అధిక ప్రభావం చూపి చివరకు డయాబెటీస్ లేదా గుండె సంబంధిత వ్యాధులకు దోవతీస్తుంది. శరీరం పై భాగం సన్నగా వుండి, కిందిభాగంలో పొడుచుకువచ్చిన పొట్టతో నడుము భాగం కనుక అధికంగా వుంటే వీరికి అధిక రక్తపోటు వుండి గుండె పోటు వచ్చే అవకాశాలు, సాధారణ శరీరం కలవారికంటే కూడా మూడు రెట్లు అధికం అంటున్నారు నిపుణులు. కనుక మీ నడుము భాగాన్ని సరైన సైజులో వుంచుకోవటం ప్రధానం. అందుకుగాను – కార్బోహైడ్రేట్లు అధికంగా వుండే బంగాళదుంపలు, తీపి పదార్ధాలు, తెల్లటి పిండి తో చేసిన లేదా రిఫైన్ చేసిన బ్రెడ్, పస్తా, రైస్, గోధుమ పిండి వంటివి తినకండి.

men and women take these foods to melt belly fat

ఇన్సులిన్ ప్రభావాన్ని పెంచేందుకు వీలైనంతవరకు రైస్ వంటివి బాగా తగ్గించండి. పూర్తిగా మానకండి. కార్బోహైడ్రేట్లు ఆరోగ్యమైన బరువు వున్నంతవరకు మంచివే. కాని పొట్ట అధిక బరువు ఎక్కితే వీటిని గణనీయంగా తగ్గించాల్సిందే. తాజా కూరగాయలు అధికంగా తినండి. కొద్దిపాటి పండ్లు, బెర్రీల వంటివి తినండి. వీటిలో వుండే కార్బో హైడ్రేట్లే మీకు సరిపోతాయి. ప్రొటీన్ల కొరకు గాను, గుడ్లు, పప్పులు, లీన్ మీట్, చేప, చికెన్ వంటివి తినండి. పాలఉత్పత్తులు తగ్గించి తినండి. ఆరోగ్యకరమైన కొవ్వులు అవసరం. ఆరోగ్యకరమైన ఆలివ్ నూనె తో వేయించిన కూరలు, చికెన్, ఫిష్ వంటివి తినండి. కొబ్బరి నూనె, ఒమేగా 3 వుండే చేప నూనె, మంచివి. పప్పులు కూడా ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు ఇస్తాయి. నడుము భాగం తగ్గాలంటే, ఒత్తిడి స్ధాయి కూడా తగ్గించుకోవడం ప్రధానం. సన్నగా వుండే మహిళలు ఒత్తిడికి గురైనపుడు పొట్టకు కొవ్వు పట్టించుకున్నట్లు స్టడీస్ చెపుతున్నాయి. ఒత్తిడి వుంటే హార్మోన్లు రిలీజ్ అయి శరీర కొవ్వు అధికంగా పెరిగేటందుకు దోహదం చేస్తాయని కూడా స్టడీలు చెపుతున్నాయి.

Admin

Recent Posts